ప్రేయసితో ఏకాంతంగా ఉండగా భర్త రాక, నగ్నంగానే..
బీజింగ్: ప్రేయసితో ఏకాంతంగా ఉన్నసమయంలో.. ఆమె భర్త హఠాత్తుగా రావడంతో అతని నుంచి తప్పించుకునేందుకు మూడో భవనం పైనుంచి దుస్తులు లేకుండానే ఓ వ్యక్తి దిగిన సంఘటన చైనాలో చోటు చేసుకుంది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.
ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. వారు వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. అయితే, ఆ యువతి తన మాజీ ప్రేమికుడుతో బంధాన్ని మాత్రం తెంచుకోలేకపోయింది. దీంతో భర్త ఇంట్లో లేని సందర్భాల్లో ప్రియుడిని ఇంటికి ఆహ్వానించేంది.

ఓ రోజు భర్త లేని సమయంలో ప్రియుడితో కలిసి ఆమె ఏకాంతంగా గడుపుతోంది. అదే సమయంలో తన భరత్ వచ్చాడు. దీంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. అతని నుంచి తప్పించుకునేందుకు ప్రియుడు... మూడో అంతస్తులోని ప్లాట్‌కు ఉన్న కిటికిలో నుంచి బయటపడేందుకు ప్రయత్నించాడు.
అతను నగ్నంగానే పైపు పట్టుకొని కిందకు జారాడు. అతను పట్టు కోల్పోయి కింద పడ్డాడు. దీంతో గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కొందరు తీశారు. అవి ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సంఘటన ప్రేమికుల రోజు నాడు జరిగింది.












Click it and Unblock the Notifications