ఊహించని సంఘటనతో గుండెలు జారిపోయాయి..(వీడియో)
ఇంతలోనే ఒక్క ఉదుటున చిన్నారి పైకి జంప్ చేసి భయపెట్టింది. ఆ తర్వాత అది నీళ్లలోకి వెళ్లిపోవడంతో.. చిన్నారి మళ్లీ అదే వంతెనపై కూర్చొంది.
ఒట్టావా: కెనడాలోని వెస్టర్న్ కోస్ట్‌లోని స్టీవెస్టన్ సముద్ర తీరంలో ఓ సీల్ చేప పెద్ద అలజడినే సృష్టించింది. ఉన్నట్టుండి.. ఒక్కసారిగా ఓ చిన్నారిపై అది దాడి చేయడంతో.. అక్కడున్నవారి గుండెలు జారిపోయాయి. అయితే తక్షణం అప్రమత్తమైన చిన్నారి తండ్రి.. వెనువెంటనే నీళ్లలోకి దూకి చిన్నారిని రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇక్కడి వెస్టర్న్ కోస్ట్‌లోని స్టీవెస్టన్ సముద్ర తీరంలో చాలామంది పర్యాటకులు నిత్యం సందడి చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ కుటుంబం కూడా బీచ్ లో గడిపేందుకు వచ్చారు. ఈ క్రమంలో ఒక వంతెన లాంటి నిర్మాణంపై వారు సేద తీరుతుండగా.. ఓ సీల్ దాని వద్దకు వచ్చింది.
కొంతమంది పర్యాటకులు తినుబండారాలు విసరడంతో.. సీల్ వాటిని అందుకుంది. చిన్నారి సైతం ఆ సీల్ ను చూసి సంబరపడింది. ఇంతలోనే ఒక్క ఉదుటున చిన్నారి పైకి జంప్ చేసి భయపెట్టింది. ఆ తర్వాత అది నీళ్లలోకి వెళ్లిపోవడంతో.. చిన్నారి మళ్లీ అదే వంతెనపై కూర్చొంది.
అయితే అలా నీళ్లలోకి వెళ్లిందో లేదో.. తిరిగి మళ్లీ చిన్నారి పైకి జంప్ చేసింది సీల్. చిన్నారి డ్రెస్ ను నోట కరుచుకుని నీళ్లలోకి ఈడ్చుకెళ్లింది. ఊహించని పరిణామానికి కంగు తిన్న ఆమె తండ్రి.. వెంటనే నీళ్లలోకి దిగి చిన్నారిని సురక్షితంగా వంతెనపైకి చేర్చాడు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.












Click it and Unblock the Notifications