కారుతో సహా భారీ వరద మధ్యలో చిక్కుకున్న డ్రైవర్‌ను ఇలా కాపాడారు!
బీజింగ్: చైనాలో వరదల్లో చిక్కుకుపోయిన ఓ కారు డ్రైవర్‌ను ఫైర్ ఫైటర్స్ రక్షించారు. ఓ నిచ్చెనతో పలువురు ఫైర్ ఫైటర్స్ అతనిని కాపాడారు. భారీ వరద మధ్యలో చిక్కుకున్న ఆ డ్రైవర్‌ను కాపాడినందుకు సదరు ఫైర్ ఫైటర్స్ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ సంఘటన తూర్పు చైనాలోని ఝెజియాంగ్ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను చైనా గ్లోబల్ టీవీ నెట్ వర్క్ (సీజీటీఎన్) షేర్ చేసింది.

ఈ వీడియోలో భారీగా పొంగుతున్న వరదలో కారు చిక్కుకుపోయింది. దాదాపు నడి మధ్యలో చిక్కుకుంది. అందులో కారు డ్రైవర్ ఉన్నాడు. విషయం తెలిసి ఫైర్ ఫైటర్స్ రంగంలోకి దిగారు. పలువురు కలిసి అతనిని కాపాడారు. అతనికి ఎలాంటి పెద్ద గాయాలు కాలేదు.
ఫైర్ ఫైటర్స్ ఒడ్డు నుంచి కారు పైకి నిచ్చెన వేశారు. పైన తాళ్లు కట్టి, దాని సహాయంతో కాపాడారు. నిచ్చెన, తాడు సహాయంతో ఓ ఫైర్ ఫైటర్ డ్రైవర్ దగ్గరకు వెళ్లి, కాపాడాడు. డ్రైవర్, ఫైర్ ఫైటర్స్ బయటకు వచ్చిన కాసేపటికి వరద మధ్యలో చిక్కుకుపోయిన కారు కొట్టుకుపోయింది.
అక్కడకు వచ్చిన ఎంతోమంది దీనిని వీడియో తీశారు. దీనిని శనివారం ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు. దీనిపై ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో.. గ్రేట్ వర్క్, సెల్యూట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications