పెద్ద తలకాయకే గురి పెట్టారు..డెడ్లీ అటాక్

Netanyahu: ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా ప్రతీకార దాడికి దిగింది. డ్రోన్లతో విరుచుకుపడుతోంది. లెబనాన్ సహకారంతో భారీ దాడులకు పాల్పడుతోంది. ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు తెగబడింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది.

ఈ మధ్యకాలంలో వరుసగా ఎదురుదెబ్బలను తింటోన్న హెజ్బొల్లా- కొంత విరామం తరువాత భారీ దాడులు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా, హమాస్ అధినేతలు ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్వర్‌ వంటి అసాధారణ నాయకులు ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే.

Drone hit a building near Israel PM Netanyauh s place of residence in Caesarea

మూడు నెలల కిందట ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇస్మాయిల్ హనియేను మట్టుబెట్టింది ఇజ్రాయెల్. రెండు రోజుల కిందటే గాజాలోని రఫా జిల్లాలో యాహ్యా సిన్వర్‌ను హతమార్చింది. దీని తరువాత ఈ రెండు మిలిటెంట్ గ్రూపులు కూడా ఇప్పట్లో కోలుకోలేకపోవచ్చని భావించినప్పటికీ- వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటోంది.

ఏకంగా బెంజమిన్ నెతన్యాహును లక్ష్యంగా చేసుకుంది హెజ్బొల్లా. ఆయన స్వస్థలం కేసారియాపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఆయన నివాసం సమీపంలో బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ దాడులను నెతన్యాహు కార్యాలయం ధృవీకరించింది కూడా. ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

మానవ రహిత ఏరియల్ వెహికల్ ద్వారా ఈ దాడులు జరిగినట్లు వెల్లడించింది. ఆ సమయంలో నెతన్యాహు గానీ, ఆయన భార్య సారా నెతన్యాహు గానీ నివాసంలో లేరని పేర్కొంది. ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం గానీ, గాయాలు గానీ కాలేదని వివరించింది.

మొత్తం మూడు మానవ రహిత ఏరియల్ వెహికల్స్‌తో ఈ దాడులు జరిగినట్లు నెతన్యాహు కార్యాలయం తెలియజేసింది. అందులో ఒకటి మాత్రమే బాంబులను జారవిడిచిందని, మిగిలిన రెండింటినీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూల్చివేయగలిగాయని పేర్కొంది. ఈ దాడులను ఎవరు చేశారనే విషయంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

ఈ దాడులను హెజ్బొల్లా చేసినట్లు ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (ఐఆర్ఎన్ఏ) వెల్లడించింది. ఇజ్రాయెల్‌కు చెందిన హీబ్రూ మీడియాను ఉటంకించింది. యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియే హత్యోదంతాల అనంతరం ఇజ్రాయెల్- లెబనాన్, ఇజ్రాయెల్- గాజా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+