జపాన్ ప్రధానికే భద్రత కరువు: ఇంటి మీద డ్రోన్
టోక్యో: ఎన్నో ప్రయోగాలు చేసి వినూత్నమైనఎలక్ట్రానిక్ వస్తువుల తయారు చేసి ప్రపంచం లోనే గుర్తింపు పొందిన జపాన్ లో ఆ దేశ ప్రధానికి భద్రత కరువైన విషయం వెలుగు చూసింది. జపాన్ ప్రధాని అధికార నివాసం (క్యాంపు కార్యాలయం) ఇంటి పై కప్పు మీద ఓ డ్రోన్ వచ్చి పడింది.
జపాన్ ప్రధాని షింజో అబెకు టోక్యోలో అధికార నివాసం ఉంది. బుధవారం అబె అధికార నివాసం ఇంటి పై కప్పు మీద ఓ డ్రోన్ వచ్చి పడింది. అటువైపు వెళ్లిన భద్రతా సిబ్బంది విషయం గుర్తించి డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

50 సెంటిమీటర్ల వింగ్ స్పాన్ ఉన్న డ్రోన్ కు చిన్నపాటి కెమెరా సైతం ఉందని జపాన్ కు చెందిన ఎఫె వార్త సంస్థ వెళ్లడించింది. అయితే డ్రోన్ కు ఎలాంటి పేలుడు పదార్థాలు పెట్టలేదని జపాన్ పోలీసు అధికారులు అంటున్నారు. విషయం తెలుసుకున్న జపాన్ ప్రధాని అబె తన అధికార నివాసంలో ఉన్న భద్రతాధికారులను సంప్రదించారు.
ఏషియా- ఆఫ్రికన్ సదస్సులో పాల్గొనేందకు జపాన్ ప్రధాని అబె రెండు రోజుల క్రితం వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఇండోనేషియాలో ఉన్నారు. గత జనవరి నెలలో అమెరికా ప్రధాని ఓబామ నివాసం ఉంటున్న వైట్ హౌస్ లాన్ లో ఇదే విదంగా ఓ డ్రోన్ వచ్చి పడింది.












Click it and Unblock the Notifications