వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు పక్కనో, చెట్ల పొదల్లోనో కాదు.. వద్దనుకునే శిశువుల్ని ఆ డబ్బాలో వేయవచ్చట..

|
Google Oneindia TeluguNews

అక్రమ సంబంధాలో.. లింగ వివక్షనో.. లేక జన్యుపరమైన లోపాలో.. కారణమైదైనా రోడ్డు పక్కనో, చెట్ల పొదల్లోనో అప్పుడే పుట్టిన శిశువుల్ని తల్లిదండ్రులు వదిలేసి వెళ్తున్న ఘటనలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. చేయని తప్పుకు అనవసరంగా చిన్నారుల జీవితం బలయిపోతోంది. సరిగ్గా ఇదే విషయంపై ఫోకస్ చేసిన అమెరికాలోని ఇండియానా ప్రభుత్వం ఇందుకోసం ఏకంగా ఒక పథకాన్నే ప్రవేశపెట్టింది.

పథకంలో భాగంగా.. ఆయా ప్రాంతాల్లో కొన్ని డబ్బాలను ఏర్పాటు చేసిన అక్కడి ప్రభుత్వం, పుట్టిన పిల్లలను వద్దనుకునే తల్లిదండ్రులెవరైనా శిశువుల్ని ఆ డబ్బాలో వదిలివెళ్లవచ్చని ప్రకటించింది. డబ్బా లోపలి వాతావరణాన్ని శిశువుల శరీర ఉష్ణోగ్రతకు అకుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసిన ప్రభుత్వం, శిశువును డబ్బాలో వేసిన వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడి చేరుకునేలా ఏర్పాట్లు చేసింది.

drop box for unwanted babys

ప్రపంచంలోనే అతిపెద్ద క్యాథలిక్ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న 'నైట్స్ ఆఫ్ కొలంబస్' ఈ పథకం కోసం 100 వరకు డబ్బాలను ప్రభుత్వానికి అందించనుంది. ఈ పథకానికి 'సేఫ్ హెవెన్ బేబీ బాక్స్' అనే పేరు పెట్టారు. పిల్లలు వద్దనుకునే తల్లిదండ్రులకు బేబీ బాక్స్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు దీనికి బీజం వేసిన ఉద్యమకారులు మోనికా కెల్సే. దీనికి చట్టబద్దత ఉందని దీన్ని ఉపయోగించుకోవడం నేరమేమి కాదని అంటున్నారామె. అనాథల్లా మారుతున్న పసిపిల్లలకు ఈ పథకం ప్రయోజకరనమే అయినప్పటికీ.. ఈ చర్యతో అవాంఛిత శిశువులు సంఖ్య కూడా పెరిగిపోయే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు పలువురు.

English summary
indiana govt in america launched a new scheme for unwanted babys. the parents who wants to leave their new born child
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X