విమానంలో టన్ను కోకైన్, పైలెట్ జంప్, పేలిపోయింది

బొగోటా: అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న విమానం కొలంబియాలో కూలిపోయింది. వెనెజులాకు చెందిన విమానంలో డ్రగ్స్ తరలిస్తున్నారని కొలంబియా అధికారులకు సమాచారం అందింది. బుధవారం కొలంబియా ఎయిర్ ఫోర్స్ అధికారులు నిఘా వేశారు.

కొలంబియా మీదుగా వెనెజులా విమానం వెళ్లింది. ఆ సమయంలో కొలంబియా ఎయిర్ ఫోర్స్ అధికారులు మరొ విమానంలో వెనెజులా విమానాన్ని వెంబడించారు. డ్రగ్స్ తరలిస్తున్న విమానం కూల్చివేయడానికి ప్రయత్నించారు.

Drugs plane crashes off the coast of colombia

అదే సమయంలో డ్రగ్స్ తరలిస్తున్న విమానం పైలెట్ కిందకు దూకేశాడు. తరువాత ఆ విమానంలోని మోటార్లు పని చెయ్యకపోవడం, సాంకేతిక లోపం వలన కొలంబియా తీరంలో ఆ విమానం కుప్పకూలిపోయింది. విమానం కూలిపోయిన ప్రాంతాన్ని కొలంబియా అధికారులు పరిశీలించారు.

కూలిపోయిన విమానంలో ఒక టన్నుకొకైన్ ఉందని, అక్రమంగా డ్రగ్స్ అమెరికాకు తరలిస్తున్నారని కొలంబియా అధికారులు చెప్పారు. ప్రతి నిత్యం వెనెజులా నుండి అమెరికాకు డ్రగ్స్ తరలిస్తున్నారు. చిన్న విమానాలలో కొలంబియా మీదుగా డ్రగ్స్ రవాణా అవుతండటంతో అక్కడి అధికారులు అలాంటి విమానాలను కూల్చి వేస్తున్నారు.

Drugs plane crashes off the coast of colombia

విమానం నుండి కిందకు దూకేసిన పైలెట్ మరణించాడు. అతని మృతదేహాన్ని కొలంబియా తీరప్రాంత గస్తీ దళం స్వాదీనం చేసుకునింది. అయితే పైలెట్ పేరు, అతని ఏ దేశానికి చెందిన వాడు అని మాత్రం తెలియడం లేదని కొలంబియా అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+