తాగి, విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన, కట్టేశారు
మాస్కో: ఓ వ్యక్తి విమానంలో తాగి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో, తోటి ప్రయాణీకులు అతనిని సీటు బెల్టు, టేపులతో కట్టేశారు. ఈ సంఘటన హాంకాంగ్ నుంచి రష్యాలోని వ్లాడివోస్టోక్ వెళ్తున్న విమానంలో చోటు చేసుకుంది.
సైబీరియా ఎయిర్ లైన్స్ విమానంలో ఓ ప్రయాణీకుడు బాగా తాగి ప్రయాణిస్తున్నాడు. అతను గట్టిగా అరుస్తున్నాడు. తోడి ప్రయాణీకులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు, ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో ఆగ్రహం చెందిన తోటి ప్రయాణీకులు అతనిని కట్టి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్లో హల్ చల్ చేస్తోంది. అతను ఎరుపు రంగు టీ షర్టులో ఉన్నాడు. ఓ ఐదుగురు కలిసి అతనిని కట్టిపడేశారు. అతనిని కట్టేసే ముందు అతని పైన చేయి చేసుకున్నారు.












Click it and Unblock the Notifications