చిత్తుగా తాగి రోడ్డుపై శివాలెత్తిన అంజలి
న్యూయార్క్: అమెరికాలో 30 ఏళ్ల మహిళా డాక్టర్ చిత్తుగా తాగేసి రోడ్డుపై వీరంగం సృష్టించింది. ఓ ఉబేర్ డ్రైవర్‌పై దాడి చేసింది. ఓ వ్యక్తికి సంబంధించిన వస్తువులను రోడ్డుపై చెల్లాచెదురుగా పారేసింది. తాగి మత్తులో తూగుతూ ఆమె సృష్టించిన వీరంగానికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో సందడి చేస్తోంది.
దాంతో ఆమెను వైద్య వృత్తి నుంచి సస్పెండ్ చేస్తూ అమెరికా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. డాక్టర్ అంజలి రాంకిసూన్ మియామీలో ప్రజా వైద్యశాల అయిన జాక్సన్ హెల్త్ సిస్టంలో రెసిడెంట్ ఎంప్లాయిగా నాలుగేళ్లుగా పనిచేస్తోంది.

ఆమె మంగళవారంనాడు మద్యం సేవించి ఆ మత్తులో వీరంగం సృష్టించినట్లు సమాచారం. ఆమె ముందస్తుగా బుక్ చేయించుకోకుండా ఉబేర్ క్యాబ్ ఎక్కింది. ఆమె మద్యం సేవించి ఉండడాన్ని గమనించిన డ్రైవర్ కారు దిగాల్సిందిగా చెప్పాడు. దీంతో ఆమె రోడ్డుపై శివాలెత్తింది.
ఆమె చిందులేస్తున్న వైనాన్ని జాన్ సింకో అనే వ్యక్తి రికార్డు చేశాడు. దాన్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేసి తదుపరి దర్యాప్తు సాగిస్తున్నారు. ఉబేర్ డ్రైవర్‌ను తోయడం, కొట్టడం కూడా వీడియోలో రికార్డయింది.
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం












Click it and Unblock the Notifications