భర్తను రేపిస్టుగా భావించి భవనంపై నుంచి..(వీడియో)
మాస్కో: మద్యం మత్తులో తన భర్తనే దెయ్యంగా భావించిన ఓ మహిళ మూడో అంతస్తు నుంచి దూకేసింది. ఆ దెయ్యం తనను రేప్ చేసి చంపేస్తుందేమోనన్న భయంతో ఈ చర్యకు పాల్పడింది. రష్యాలోని తులున్ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో హల్‌చల్ చేస్తోంది.
మద్యాన్ని సేవించిన ఆ మహిళకు తన గది తలుపును కొడుతున్న చప్పుడు వినిపించడంతో భయపడింది. తలుపు వెనుక ఉన్నది దెయ్యం అయి ఉంటుందని, అది తనను అత్యాచారం చేసి.. చంపడానికి వచ్చిందని ఆమె భయపడింది.
దీంతో ఆ దెయ్యం నుంచి తప్పించుకునేందుకు మూడో అంతస్తు కిటికీ నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో కిటికీ నుంచి ఆమె జారి మంచులో పడిపోయింది. స్థానిక టీవీ కంపెనీ ప్రతినిధులు ఆమెను గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

తీవ్ర గాయాలైన ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. అసలు ఏమైందని ఆమెను వైద్యులు ప్రశ్నించగా విషయం చెప్పింది. తలుపు బయట ఉన్న వ్యక్తి దెయ్యం అయి ఉంటుందని, అది తనపై దాడి చేసేందుకే వచ్చాడని తనకు అనిపించిందని, అందుకే తాను కిటికీ నుంచి దూకేశానని ఆమె తెలిపింది.
'వారం రోజులుగా నిరాటంకంగా మద్యాన్ని తాగుతుండటంతో ఆమెలో మానసిక సమస్య తలెత్తింది. అందుకే తాగిన మత్తులో కిటికీ నుంచి దూకేసింది. నిజానికి ఆ సమయంలో ఆమె భర్త ఆఫీసు నుంచి మధ్యాహ్నం భోజనం చేయడానికి వచ్చాడు. అతడిని ఆమె దెయ్యంగా భావించింది' అని పోలీసులు వెల్లడించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications