ఒబామాకు దుబాయ్‌లో అన్ని సౌకర్యాలతో జాబ్ ఆఫర్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా త్వరలో పదవీ విరమణ చేయబోతున్న బరాక్ ఒబామాకు దుబాయ్‌కు చెందిన ఓ న్యాయ సంస్థ ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. అధ్యక్షుడిగా పదవీ విరమణ అనంతర మీరు ఎలాగూ ఖాళీగా ఉంటారని, మీకు దుబాయ్‌లో ఉద్యోగం ఇస్తానని ఒబామాకు ఆఫర్ చేశారు.

తన లా కంపెనీలో ఉద్యోగం ఇస్తానని, దాని వల్ల ఇస్లాం మతం పైన, సహనం పైన ఆయనకు మరింత అవగాహన వస్తుందని చెప్పారు. ఇస్లాం పట్ల సహనం అంటే అఱ్థం ఏమిటో మరింత బాగా తెలుసుకోవడానికి ఈ ఉద్యోగం ఆయనకు ఉపయోగపడుతుందని ఎమిరేటీ లాయర్ ఎయిసా బిన్ హైదర్ ట్వీట్ చేశారు.

మంగళవారం నాటికి ఒబామా పదవీ కాలం ఇంకా 247 రోజులు ఉంటుంది. కొత్త అధ్యక్షుడు 2017 జనవరి 20వ తేదీన పదవీ స్వీకారం చేయవలసి ఉంటుంది.

 Dubai law firm offers job to Obama so he can learn more about tolerance of Islam

ఈ సందర్భంగా ఒబామాకు ఉద్యోగం ఇస్తామని, ఆయనకు మంచి జీతంతో పాటు ఉండేందుకు ఇల్లు, అరబ్ దేశాలు తిరిగి రావడానికి టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. అమెరికన్, పాశ్చాత్య మీడియా ఎప్పుడూ ఇస్లాంను ఉగ్రవాదానికి ప్రతిరూపంగా చిత్రీకరిస్తున్నాయన్నారు. అయితే అది పూర్తి అవాస్తవమన్నారు.

ఇస్లాం అంటే సహనానికి, క్షమాగుణానికి, అర్థం చేసుకోవడానికి మారుపేరు అన్నారు. పాశ్చాత్యులు ఇస్లాంను అర్థం చేసుకొని, ఆమోదించేందుకు ఏకైక మార్గం వాళ్లు వచ్చి తమతో కలిసి ఉండటమే అన్నాడు. ఒబామా వైట్ హౌస్ వదలగానే ఆయనకు తన సంస్థలో ఉద్యోగం ఇస్తానని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+