దుబాయ్‌లో బ్రిటిష్ టూరిస్ట్ అతివేగం, 4 గంటల్లోనే రూ.31 లక్షల జరిమానా
దుబాయ్: బ్రిటిష్ టూరిస్ట్ ఒకరు దుబాయ్‌లో తన కారును అత్యంత వేగంగా నడపడంతో స్థానిక పోలీసులు అతనికి రూ.30 లక్షలకు పైగా జరిమానా విధించారు. దుబాయ్ అంటే మనకు ఆకాశహర్మ్యాలు, ఎత్తైన భవనాలు, అందమైన రోడ్లు కనిపిస్తాయి. ఈ రోడ్లపై నిబంధనలకు మించి వేగంగా దూసుకెళ్లిన విదేశీయుడికి భారీ జరిమానా పడింది.
ఇటీవల 25 ఏళ్ల బ్రిటిష్ యువకుడు దుబాయ్‌లో లంబోర్గిణి హరికేన్ కారును రెండు రోజులకు గాను రూ.1 లక్ష చెల్లించి అద్దెకు తీసుకున్నాడు. అథని పాస్ పోర్టును అద్దెకు ఇచ్చే ఏజెన్సీ దగ్గర పెట్టుకుంది. దుబాయ్ రోడ్లపై చక్కర్లు కొట్టాడు. కానీ నిబంధనల గురించి తెలియదు. అయితే అత్యాధునిక స్పీడ్ కెమెరాల కంటికి చిక్కాడు.

ఆ బ్రిటిష్ యువకుడి కారు పరిమిత వేగం దాటినప్పుడల్లా ఆ కారు ఖాతాకు జరిమానాలు పడ్డాయి. అలా నాలుగు గంటల్లో ఏకంగా రూ.47వేల డాలర్లు మన రూపాయల్లో రూ.31 లక్షలకు పైగా చెల్లించాడు. షేక్ జాయెద్ రోడ్డుపై వెళ్లాల్సిన వేగం కంటే వెళ్తూ 32సార్లు కెమెరా కంటికి చిక్కాడు. మరో రోడ్డుపై అలాగే వెళ్లాడు.
దీంతో పోలీసులు కారు అద్దెకు ఇచ్చిన యజమానిని సంప్రదించారు. అతని పాస్ పోర్టు ఆధారంగా బ్రిటిష్ ఎంబసీని సంప్రదించారు. ఈ విషయాన్ని బ్రిటిష్ ఎంబసీకి కూడా చెప్పారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే ఖరీదైన విదేశీ కార్లు దుబాయ్‌లో ఉంటాయి. వీధి వీధిలో సూపర్ కార్లు కనిపిస్తాయి. అత్యంత వేగంగా వెళ్లే బుగాటి, లంబోర్గిణి హరికేన్ తదితర విదేశీ కార్ల వల్ల దుబాయ్ పోలీసులకు ట్రాఫిక్‌ను అదుపులో ఉంచడం కష్టమవుతోంది. వాటి వేగ నియంత్రణకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అత్యంత కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు ఉంటాయి.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications