Israel–Hamas war: యుద్ధం వేళ కీలక నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా..!
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధ సమయంలో సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ తో జరుగుతోన్న ఒప్పంద చర్చలకు సౌదీ బ్రేక్ వేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా సమూహం హమాస్ మధ్య యుద్ధం తీవ్రమవుతున్నందున దాని విదేశాంగ విధానంపై రియాద్ సమాలోచనలు చేస్తోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కు ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌తో సాధారణీకరణపై US-మద్దతుతో చర్చలు ఆలస్యం అవుతాయని రెండు వర్గాలు రాయిటర్స్‌తో తెలిపాయి. యూఎస్ మద్దతు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలపైనే ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఇరాన్ హమాస్ ఉగ్రవాదులకు మద్దతు తెలుపుతోంది.ఇరాన్-మద్దతుగల హమాస్ ఇజ్రాయెల్‌పై విధ్వంసకర దాడిని ప్రారంభించడం ద్వారా అక్టోబర్ 7న యుద్ధాన్ని ప్రారంభించింది.

కొద్ది సంవత్సరం అరబ్‌లీగ్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోంది. 1979లో ఈజిప్టుతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంది. ఇటీవల కాలంలో యూఏఈ, బహ్రెయిన్ దేశాలు ఆ దేశంతో ఒప్పందాలు కూడా చేసుకుంది. ఇందుకు అమెరికా ఇజ్రాయెల్ కు అండగా నిలు్తోంది. తాజాగా సౌదీ అరేబియాను ఆ జాబితాలోకి చేర్చే ప్రయత్నం అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలు చేసింది. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తూ ఇజ్రాయెల్- సౌదీ అరేబియా దేశాలు సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇరు దేశల మధ్య చర్చలు జరిగేలా చేసింది.
ఈ ప్రయత్నమే.. గాజా-ఇజ్రాయెల్ మధ్య తాజా యుద్ధానికి కారణమన్న వాదనలు కూడా ఉన్నాయి. తాజా యుద్ధంతో అమెరికా ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. అక్టోబరు 7న జరిగిన దాడిలో హమాస్ యోధులు 1,300 మందికి పైగా ఇజ్రాయెలయన్లు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిస్పందనగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో శుక్రవారం నాటికి 1,500 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ అరబ్ దేశాల్లో బలమైన దేశంగా ఉన్న సౌదీ అరేబియాతో సంబంధాలు చేసుకోవాలన్న ఇజ్రాయెల్ ప్రయత్నాలు బెడిసికొట్టాయని చెప్పుకోవచ్చు.












Click it and Unblock the Notifications