అనూహ్యం: 2020లో అమెరికా అధ్యక్ష బరిలో 'ది రాక్'!
2020లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ ప్రకటించిన జాన్సన్.. ట్రంప్ కన్నా తానే బాగా పనిచేస్తానని తనకు తాను కితాబిచ్చుకున్నాడు.
వాషింగ్టన్: రెజ్లర్ గాను, యాక్టర్ గాను తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ప్రముఖ హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్సన్(రాక్) భవిష్యత్తులో రాజకీయాల్లోకి కూడా రావాలని భావిస్తున్నారు. ఈ మేరకు తన మనసులోని మాటను బయటపెట్టారు. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ ప్రకటించిన జాన్సన్.. ట్రంప్ కన్నా తానే బాగా పనిచేస్తానని తనకు తాను కితాబిచ్చుకున్నాడు.
అగ్రరాజ్యానికి అధ్యక్షుడవడం అంత సాధారణమైన విషయమేమి కాదని, కానీ తన విషయంలో మాత్రం అది సాధ్యమేనని చెప్పుకొచ్చారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానెవరికీ ఓటేయలేదని తెలిపాడు. ఒకవేళ తానే గనుక అధ్యక్షుడినైతే అందరిని కలుపుకుని ముందుకెళ్తానని, తనను వ్యతిరేకించేవారిని సైతం తప్పు పట్టనని చెప్పాడు.

కాగా, డ్వేన్ జాన్సన్ నల్ల జాతికి చెందిన సమోవన్ అనే తెగకు చెందినవాడు. రెజ్లర్ గా, యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తను అమెరికాలోని అన్ని వర్గాలకు బాగా దగ్గరయ్యాడు. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే యాక్టర్ గాను చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం బేవాచ్ అనే హాలీవుడ్ సినిమాలో జాన్సన్ నటిస్తున్నాడు. భారతీయ నటి ప్రియాంక చోప్రా సైతం ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications