వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : ప్యాంటులో ఈ-సిగరెట్ పేలింది..

న్యూయార్క్ లోని గ్రాండ్ సెంట్రల్ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేస్తున్న ఓ వ్యక్తి ప్యాంటు జేబులో ఈ-సిగరేట్ పేలింది.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: సిగరెట్ తాగే అలవాటును మానుకోవాలనుకునేవారు.. ఈ-సిగరెట్స్ కాల్చడం కామన్. సిగరెట్ తాగిన ఫీల్‌తో పాటు.. ఆరోగ్యంపై అంతగా ప్రభావం చూపదు కాబట్టి.. ఈ-సిగరెట్స్ ను చాలామంది కాలుస్తుంటారు. అయితే న్యూయార్క్ లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే మాత్రం.. ఈ-సిగరెట్ కూడా డేంజరే అనకమానరు.

ఇంతకీ విషయమేంటంటే.. న్యూయార్క్ లోని గ్రాండ్ సెంట్రల్ షాపింగ్ మాల్‌లో షాపింగ్ చేస్తున్న ఓ వ్యక్తి ప్యాంటు జేబులో ఈ-సిగరేట్ పేలింది. ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకోవడంతో.. చుట్టున్నవారంతా పరుగులుపెట్టారు. పేలుడు దాటికి సదరు బాధితుడి చేతులకు గాయాలయ్యాయి. పేలుడుతో కూడిన మంటలు ఒక్కసారిగా అతని ప్యాంటు నుంచి వెలువడ్డాయని సెంట్రల్ సెల్లార్స్ ఉద్యోగి జాన్ లీ తెలిపారు.

E-cigarette explodes in man's pants, attorney says

పేలుడు తర్వాత హుటాహుటిన బాధితుడిని ఒక ప్రైవేటు అంబులెన్స్ కు తరలించారు. అయితే బాధితుడికి స్వల్ప గాయాలు మాత్రమే అయినట్టు వైద్యులు చెప్పారు. మాల్ లో జరిగిన ఈ ప్రమాదం వల్ల.. షాపింగ్ చేసే వ్యక్తులకు గానీ, మాల్ కు గానీ ఎలాంటి ఆటంకం కలగలేదని షాపింగ్ మాల్ యాజమాన్యం తెలిపింది.

కాగా, ఈ-సిగరెట్లను ప్యాక్ చేసుకుని ప్రయాణించడాన్ని నిషేధిస్తూ గతేడాది కొత్త నిబంధన అమలులోకి తెచ్చింది అక్కడి ప్రభుత్వం. ఏదేమైనా పొగరాయుళ్లు ఈ-సిగరెట్ పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిందే.

English summary
An e-cigarette exploded in the pocket of an employee at a New York City wine store Wednesday, badly burning the man, his attorney said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X