చైనాపై కేంద్రం బిగ్ స్టెప్?

India China border disputes: కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. శాంతియుత వాతావరణం నెలకొనడానికి భారత్ చేపట్టిన చర్చలు ఫలించాయి. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. మొత్తానికి అయిదు సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగుతున్న యుద్ధ వాతావరణం చల్లారినట్టే కనిపిస్తోంది.

లఢక్ తూర్పు ప్రాంతం సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీలో 2020 జూన్ 15, 16వ తేదీల్లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి ఘటనలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆ ఘర్షణల్లోనే తెలంగాణకు చెందిన సంతోష్ బాబు అమరుడయ్యారు.

EAM S Jaishankar meets Chinese President Xi Jinping

అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద యుద్ధ వాతావరణం కొనసాగుతూనే వచ్చింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత్-చైనా సరిహద్దు వెంబడి రెండు వైపులా వేలాదిమంది సైనికులు మోహరించారు. పాంగ్యాంగ్ త్సో సరస్సు, గాల్వన్ వ్యాలీ, డెప్సాంగ్, డెమ్‌చోక్ వంటి ప్రాంతాల్లో సైనికులు యుద్ధానికి సిద్ధం అయ్యారు.

ఆ తరువాత రెండు దేశాల మధ్య ఆర్మీ కార్ప్స్ కమాండర్ స్థాయిలో శాంతి చర్చలు ఏర్పాటయ్యాయి. అనేక దఫాలుగా సాగాయి. సైనిక బలగాలను వెనక్కి పిలిపించుకోవాలనే సింగిల్ అజెండా కింద చర్చలను నిర్వహించారు. బోర్డర్ ఆఫీసర్స్ మీటింగ్ పాయింట్ వద్ద సుదీర్ఘంగా కొనసాగాయి.

ఉద్రిక్తతను చల్లార్చడానికి రెండు దేశాల సైన్యాధికారులు అప్పట్లో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పరస్పర అంగీకారానికి వచ్చారు. రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న విభేదాలను రూపుమాపేలా, శాంతియుత వాతావరణం నెలకొల్పేలా ముందడుగు వేశారు. మూడుదశల్లో బలగాలను వెనక్కి పిలిపించుకోవడానికి రెండుదేశాల సైన్యాధికారుల మధ్య అంగీకారం కుదిరింది.

ఈ క్రమంలో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ చైనాలో అడుగు పెట్టారు. బీజింగ్‌ లో ఆదేశాధ్యక్షుడు గ్ఝి జిన్‌ పింగ్‌ తో సమావేశం అయ్యారు. ఆరు సంవత్సరాల తరువాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి చైనాకు వెళ్లారు జైశంకర్. తన కౌంటర్ పార్ట్ వాంగ్ యిని కూడా కలిశారు. దీనికి సంబంధించిన వివరాలను తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ ఉదయం బీజింగ్‌ లో తోటి ఎస్‌సీఓ విదేశాంగ మంత్రులతో కలిసి గ్ఝి జిన్‌ పింగ్‌ తో సమావేశం అయ్యానని తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంపించిన శుభాకాంక్షలను జిన్ పింగ్ కు తెలియజేశానని అన్నారు. భారత్- చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇరు దేశాల అభివృద్ధి గురించి ఆయనతో చర్చించినట్లు చెప్పారు. ఈ విషయంలో ఇరు దేశాల అధినాయకులు ఇచ్చే మార్గదర్శకత్వం అత్యంత విలువైనదిగా అభివర్ణించారు.

అంతకుముందు వాంగ్ యితో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. భారత్- చైనా సరిహద్దు వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నివారించి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం ద్వారా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని, పురోగతి సాధించాయని అన్నారు.

ఇరు దేశాల పరస్పర వ్యూహాత్మక, ద్వైపాక్షిక సంబంధాలు మరింత సజావుగా సాగుతున్నాయనడానికి ఇదే ఉదాహరణగా జైశంకర్ పేర్కొన్నారు. సరిహద్దుకు సంబంధించిన ఇతర అంశాలు, ఉద్రిక్తతలను తగ్గించడం సహా ఇతర అంశాలను పరిష్కరించుకోవడం తమ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు.

ఎస్‌సీఓ సమావేశంలో వాంగ్ యీ మాట్లాడారు. ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తోన్న విధానాలు, వైఖరిని ప్రశంసించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై పోరాడటంలో చైనా కూడా రాజీపడబోదని స్పష్టం చేశారు. అన్ని దేశాలు కూడా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోన్నాయని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్‌ ను భారత్ అనుసరిస్తోందని, ఇది ప్రశంసనీయమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+