న్యూయార్క్ తోపాటు పలు నగరాల్లో భూకంపం: కంపించిన యూఎన్ సమావేశం
న్యూయార్క్: అమెరికాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 4.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం పది కిలోమీటర్ల లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
భూకంప కేంద్రం న్యూజెర్సీలోని వైట్ హౌస్ స్టేషన్‌కి సమీపంలో ఉందని వెల్లడించింది. న్యూయార్క్ నగరంలో ప్రకంపనలు చోటు చేసుకోవడంతో భయంతో జనం బయటకు పరుగులు తీశారు. అయితే, తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలిసింది. న్యూయార్క్, న్యూజెర్సీతోపాటు ఉత్తర పెన్సిల్వేనియా, పశ్చిమ కనెక్టికట్లతో భూకంప ప్రభావం కనిపించింది.

కాగా, భూకంపం కారణంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశానికి అంతరాయం ఏర్పడింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో ఏర్పడిన పరిస్థితులపై చర్చ జరుగుతుండగా ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
#BREAKING: “You’re making the ground shake!” UN Security Council hears as mid-morning #earthquake interrupts briefing on the situation in the Middle East. pic.twitter.com/1F8TZBHKKu
— UN News (@UN_News_Centre) April 5, 2024
మరోవైపు, శుక్రవారం ఉదయం మరియానా దీవుల సమీపంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే నివేదించింది.
USGS ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల తర్వాత (4 pm ET గురువారం) గుర్తించదగిన భూకంపం నమోదైంది. మరియానా ద్వీపం ఉత్తరాన అతిపెద్ద సైపాన్ మాగ్ దీవుల ప్రాంతంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications