చైనాలో భారీ భూకంపం- పాక్, టర్కీ తర్వాత..!!
China earthquake: భారత ఉపఖండంలో వరుస భూకంపాలు సంభవిస్తోన్నాయి. ప్రత్యేకించి- పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లల్లో. ఈ నెలలో ఇప్పటివరకు రెండుసార్లు పాకిస్తాన్ లో భూమి ప్రకంపించింది. ఈ నెల 5వ తేదీన ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్, 12వ తేదీన సెంట్రల్ పాకిస్తాన్‌లో భూకంపం సంభవించింది.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా రికార్డయింది. క్వెట్టా, లర్ఖానా మధ్య గల భక్తియార్‌బాద్- డేరామురాద్ జమాలి ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. దీనివల్ల ప్రాణ నష్టం సంభవించలేదు. ఆస్తినష్టం నమోదైంది. పలు నివాసాలు బీటలు వారాయి. కొన్ని చోట్ల పాక్షికంగా కూలిపోయాయి.

గురువారం నాడు టర్కీలోనూ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1 గా రికార్డు అయింది. ఇప్పుడు తాజాగా చైనాలో భూకంపం సంభవించింది. 25.05 నార్త్ అక్షాంశం, 99.72 ఈస్ట్ రేఖాంశం పరిధిలోకి వచ్చే యునాన్ ప్రావిన్స్ పశ్చిమ ప్రాంతంలోని బావోషాన్, కున్మింగ్, అటానమస్ ప్రీ-ఫెక్చర్ లో భూమి ప్రకంపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది.
ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు సెస్మాలజీ సెంటర్ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5గా రికార్డయిందని వివరించింది. ఈ ప్రాంతం మయన్మార్ సరిహద్దులకు ఆనుకుని ఉండటం వల్ల ప్రకంపనలు ఆ దేశంలో కూడా కనిపించాయి.
ఇది షాల్లో భూకంపం. సాధారణ భూకంపం కంటే దీని తీవ్రత అధికంగా ఉంటుంది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు.
ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రత కనిపించింది. పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. బావోషాన్, కున్మింగ్, లీజియాంగ్, పన్ఝిహువాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.












Click it and Unblock the Notifications