పాకిస్తాన్‌ లో భారీ భూకంపం

Pakistan earthquake 2025: పాకిస్తాన్‌లో భూకంపాలు సంభవిస్తోన్నాయి. నెలన్నర రోజుల వ్యవధిలో అయిదుకు పైగా తీవ్రతతో భూమి కంపించడం ఇది మూడోసారి. మే లో వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రకంపించింది. ఇప్పుడు తాజాగా సెంట్రల్ పాకిస్తాన్‌ లో మరోసారి ఇలాంటి పరిస్థితే ఏర్పడింది.

ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.2గా రికార్డయింది. ఈ తెల్లవారు జామున సరిగ్గా 3:54 నిమిషాలకు భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. 30.25 అక్షాంశం, 69.82 రేఖాంశం పరిధిలోకి వచ్చే క్వెట్టా, ముల్తాన్ మధ్య గల నహర్ కోట్- మవాండ్- డేరా ఘాజీ ఖాన్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించింది.

Earthquake today Magnitude 5 2 on the Richter scale jolts Pakistan

ఉపరితలం నుంచి 150 కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్స్‌లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు సెస్మాలజీ సెంటర్ తెలిపింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు.

ఈ భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు. ఆస్తినష్టం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. క్వెట్టా, డేరా ఘాజీ ఖాన్, ముల్తాన్ లల్లో భూకంప తీవ్రత కనిపించింది. సెంట్రల్ పాకిస్తాన్ లో పలు చోట్ల ప్రకంపనలు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి.

భౌగోళికంగా- క్రియాశీలక భూకంప ప్రాంతం పాకిస్తాన్. యురేసియన్- ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల పరిధిలోకి వస్తుందీ దేశం. దీని పరిధిలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ నెలలో రెండోసారి అక్కడ భూమి ప్రకంపించిందంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తు‌న్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, కొన్ని గిరిజన ప్రాంతాలు.. యురేసియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉన్నాయి. సింధ్, పంజాబ్ ప్రావిన్స్‌తో పాటు మనదేశంలోని జమ్మూ కాశ్మీర్.. ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్ పరిధిలో ఉంటాయి. ఫలితంగా ఈ రీజియన్‌లో భూకంపాలు తరచూ సంభవిస్తుంటాయని సెస్మాలజీ సెంటర్ తెలిపింది.

కాగా 2005లో పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సంభవించిన 7.6 తీవ్రతతో కూడుకున్న భూకంపం వేలాదిమందిని పొట్టనబెట్టుకుంది. 73 వేలమందికి పైగా మరణించారు అప్పట్లో. లక్షమందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇది ఆ దేశ చరిత్రలో అతిపెద్ద విపత్తుగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+