Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారీ భూకంపం- పోటెత్తిన సముద్రం

Alaska earthquake 2025: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. తీర ప్రాంత నగరంలో భూమి ప్రకంపించడం వల్ల సముద్రం పోటెత్తింది. అల్లకల్లోలానికి గురైంది. తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడ్డాయి. సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకున్నారు. భూకంప తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. తీరాన్ని ఖాళీ చేయించారు.

రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారు జామున 3:58 నిమిషాలకు భూమి ప్రకంపించింది. అలస్కాలో 54.99 నార్త్ అక్షాంశం, 159.98 వెస్ట్ రేఖాంశం వద్ద గల ప్రాంతం గల శాండ్ పాయింట్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

Earthquake today Magnitude 6 3 jolts Alaska

ఉపరితలం నుంచి 48 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నేషనల్ వెదర్ సర్వీస్.. సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఆ తరువాత ఈ హెచ్చరికను అడ్వైజరీగా తగ్గించింది.

అలాస్కాకు వాయవ్య పోపోఫ్ ద్వీపంలో ఉంటుందీ.. శాండ్ పాయింట్. ఇది అలాస్కాలోని యాంకరేజ్ కు నైరుతి దిశలో సుమారు 600 మైళ్ల దూరంలో ఉండే పర్యాటక ప్రదేశం. ఇదే ప్రాంతంలో ఈ నెల 17వ తేదీన ఇంతకంటే భారీ తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

అప్పట్లో దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. సాధారణంగా అయిదుకు పైగా తీవ్రతతో భూమి కంపించడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటారు జియాలజిస్టులు. అలాంటిది నాలుగు రోజుల వ్యవధిలో ఆరుకు పైగా తీవ్రతతో భూకంపం సంభవించడం పట్ల దృష్టి సారించారు.

పసిఫిక్ తీరంలోని దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం మొదలుకుని కెన్నడీ ఎంట్రన్స్, యునిమాక్ పాస్, అలాస్కా వరకు సునామీ అడ్వైజరీ అమలులో ఉంది. శాండ్ పాయింట్ తో పాటు అలస్కా నగరాలైన కోల్డ్ బే, కొడియాక్ కూడా సునామీ అడ్వైజరీ పరిధిలో ఉన్నాయి.

ఇది షాలో భూకంపం. లోతు తక్కువగా ఉండే భూకంపాలను షాలోగా పరిగణిస్తారు. సాధారణ భూకంపాల కంటే ఇవి మరింత ప్రమాదకరం. ఒక్కసారి షాలో ఎర్త్ క్వెక్ సంభవించిందంటే.. ప్రధాన ప్రకంపం తర్వాత కూడా ప్రకంపనలు సంభవిస్తుంటాయి. దీనివల్ల నష్టం అధికంగా ఉంటుంది. భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి భూకంపాలు ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. ఎక్కువ విధ్వంసాన్ని కలిగిస్తాయి.

నిజానికి రింగ్ ఆఫ్ ఫైర్ దేశాల్లో అమెరికా ఒకటి కావడం వల్ల తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, యునైటెడ్ స్టేట్స్, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండే దేశాలు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+