పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం

Earthquake: పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి. సముద్రంలో ఇంత భారీ ఎత్తున భూకంపం సంభవించడం వల్ల సునామీ వస్తుందనే భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. దీనికి అనుగుణంగా సునామీ అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. సునామీ సంభవించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు.

దక్షిణ పసిఫిక్ మహా సముద్రం రీజియన్ లోని సమోవా సమీపంలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6గా రికార్డయింది. సమోవా ద్వీప రాజధాని అపియా నగరానికి నైరుతి దిశగా 440 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

Earthquake today Magnitude 6 6 on the Richter scale struck Samoa

ఉపరితలం నుంచి 314 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని సమోవా అబ్జర్వర్ వెబ్‌సైట్‌ తెలిపింది. తొలుత సునామీ రావొచ్చనే భయాలు వ్యక్తమైనప్పటికీ.. ఆ అవకాశం లేదని సమోవా వాతావరణ శాఖ ధృవీకరించినట్లు వివరించింది.

హోనోలులులోని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ కూడా ఎటువంటి సునామీ హెచ్చరికలను జారీ చేయలేదు. భూకంపాల తీవ్రత అధికంగా ఉండే రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంటుంది.. సమోవా. పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. క్రియాశీలక అగ్నిపర్వతాలు ఉన్నాయి.

2009లో.. సమోవా- అమెరికన్ సమోవా మధ్య రెండు భారీ భూకంపాలు సంభవించాయి. సునామీ సైతం ఏర్పడింది. సునామీ బారిన పడి అప్పట్లో సమోవా, అమెరికన్ సమోవా, టోంగాల్లో 192 మంది మరణించారు. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో భూమి కంపించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+