వీడియో వైరల్: నోరు జారిన సెనేటర్... కోడిగుడ్డుతో దాడి

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా సెనేటర్ ఫ్రేజర్ అన్నింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. అనవసరంగా నోరు జారడంతో ఓ యువకుడు అతనిపై కోడిగుడ్డుతో దాడి చేశాడు. శుక్రవారం న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై మాట్లాడిన సెనేటర్ ఫ్రేజర్ ముస్లింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫ్రేజర్ వెనకాలే ఉన్న ఓ వ్యక్తి గుడ్డుతో దాడి చేశాడు.

కెమెరాల ముందు నిల్చుని న్యూజిలాండ్ ఘటనపై మాట్లాడుతూ ఎక్కువమంది న్యూజిలాండ్‌కు వలసపోవడంతోనే కాల్పులు జరిగాయని వ్యాఖ్యానించారు ఫ్రేజర్. తను మాట్లాడిన మాటలు కెమెరాల్లో రికార్డు అయ్యాయి. యువకుడు వెంటనే కోడి గుడ్డుతో ఫ్రేజర్ పై దాడి చేశాడు. ఆగ్రహం చెందిన ఫ్రేజర్ యువకుడిపై వెంటనే పిడిగుద్దులు విసిరాడు. అక్కడే ఉన్న కొందరు ఫ్రేజర్‌ను అడ్డుకోవడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంది.

Egg smashed on Aussie senators head over anti-Muslim comments on New Zealand attack

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ సెనేటర్‌గా ఫ్రేజర్ ఉన్నారు. ఫ్రేజర్ వీడియో వైరల్‌గా మారడంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ స్పందించారు. ఘటనను దురదృష్టకరం అని అభివర్ణించారు స్కాట్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+