కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు మరో బ్రేక్: ఆ యాంటీబాడీ డ్రగ్ వల్ల నో యూజ్: ఇప్పట్లో కష్టమే
వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి పలు దేశాల్లో వ్యాక్సిన్ తయారీ కొనసాగుతోంది. భారత్ సహా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్లపై క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయి. అవి ఎంత వరకు సఫలమౌతాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. తాజాగా అమెరికాలో చేపట్టిన యాంటీబాడీ డ్రగ్ ట్రయల్స్ విఫలం అయ్యాయి. ఆ డ్రగ్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని తేలింది. ఫలితంగా క్లినికల్ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అమెరికా.
Recommended Video
వ్యాక్సిన్, యాంటీబాడీ డ్రగ్ కోసం జనం ఎదురు చూస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ట్రయల్స్ విఫలం కావడం పట్ల నిపుణులను నిరాశలో ముంచెత్తింది. ఎలీ లిల్లీ అనే అమెరికన్ ఫార్మాసూటికల్స్ సంస్థ ఈ యాంటీబాడీ డ్రగ్‌ను రూపొందించింది. ఇండియానాపోలీస్ ప్రధాన కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోన్న ఈ సంస్థ 18 దేశాలకు విస్తరించింది. కొద్దిరోజుల కిందట ఈ సంస్థ యాంటీబాడీ డ్రగ్‌ను తయారు చేసింది. రెండు వారాల నుంచీ దీనిపై ట్రయల్స్ నిర్వహిస్తోంది.

అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఈ రెండు వారాల వ్యవధిలో ఈ డ్రగ్ వల్ల ఎలాంటి మెరుగైన ఫలితాలు రాలేదు. కరోనా బారిన పడిన పేషెంట్ల ఆరోగ్య పరిస్థితుల్లో ఎలాంటి సానుకూల ప్రభావం కనిపించలేదు. ఈ డ్రగ్‌పై ట్రయల్స్‌ను కొనసాగించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని భావించామని, నిలిపివేయాలని ఆదేశించినట్లు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ వెల్లడించింది.
కరోనా వైరస్ బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇలాంటి యాంటీబాడీ డ్రగ్స్ ద్వారానే చికిత్స అందించడం, అది ఫలితాన్ని ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. న్యూయార్క్‌కు చెందిన రీజెనెరాన్ ఫార్మాసూటికల్స్ సంస్థ రూపొందించిన యాంటీబాడీ డ్రగ్ ద్వారా డొనాల్డ్ ట్రంప్‌కు చికిత్స అందించారు. అది కొంతమేర సానుకూల ప్రభావం చూపిందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ పేర్కొంది. కెనడియన్ కంపెనీ యాబ్‌సెల్లెరాతో కలిసి అభివృద్ధి చేసిన డ్రగ్‌పై తాము ప్రత్యేకంగా ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నట్లు ఎలీ లిల్లీ సంస్థ వెల్లడించింది.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications