ట్విట్టర్ లోగో గోల- X ఫిక్స్
వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్‌లో పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. వాటికి అంతు ఉండట్లేదు. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన ఆయన.. మరిన్ని సంస్కరణలకు తెర తీశారు.
ఇదివరకు ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ లోగోను మార్చేసిన విషయం తెలిసిందే. బ్లూ బర్డ్ స్థానంలో కుక్క ఇమేజ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. క్రిప్టోకరెన్సీలో ఒకటైన డోజ్‌కాయిన్ లోగోగా వినియోగించే శునకం ఫొటో అది. సాధారణంగా నెటిజన్లు మీమ్స్ సృష్టించడానికి ఈ డోజ్‌కాయిన్ డాగ్ ఫొటోను వాడుతుంటారు. దాన్ని ట్విట్టర్ లోగోగా మార్చారు.

యూజర్లు తమ ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేసి, రీఫ్రెష్ చేయగానే కొత్త లోగో దర్శనం ఇచ్చింది అప్పట్లో. డోజ్ కాయిన్ లోగోగా షిబా ఇను అనే జాగిలం ఫొటోను వినియోగిస్తోన్నారు. 2013 నుంచీ ఇదే లోగో కొనసాగుతోంది. షిబా ఇను అనేది హంటింగ్ బ్రీడ్. జపాన్‌కు చెందిన హంటింగ్ బ్రీడ్ జాగిలం ఇది.
నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లకు.. ఈ షిబా ఇను జాగిలం మీమ్స్ చిరపరిచితమే. అది నచ్చడం వల్లే తాను కూడా ట్విట్టర్ బ్లూబర్డ్ లోగోకు బదులుగా డోజ్ కాయిన్ షిబా ఇను డాగ్ ఫొటోను వాడినట్లు ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఇదివరకు కూడా ఇదే డోజ్ కాయిన్ డాగ్ లోగోను ఒకట్రెండు సందర్భాల్లో ఎలాన్ మస్క్ వినియోగించారు. ఆ తరువాత దాన్ని వెనక్కి తీసుకున్నారు. మళ్లీ ట్విట్టర్ బ్లూ బర్డ్ లోగోను పునరుద్ధరించారు.
— Elon Musk (@elonmusk) July 23, 2023
ఇప్పుడు మళ్లీ లోగో ఛేంజ్ ప్రతిపాదనలను మళ్లీ తెరమీదికి తీసుకొచ్చారు ఎలాన్ మస్క్. ప్రస్తుతం ఒక్క పిట్టే తమ లోగోలో ఉందని, దీన్ని మార్చాలనే యోచనలో ఉన్నామని అన్నారు. ఇకపై అన్ని పక్షులకు వీడ్కోలు పలుకుతామని పేర్కొన్నారు. మున్ముందు ఎలాంటి లోగోను ఫిక్స్ చేయాలనే విషయంపైనా లీక్ ఇచ్చారు ఎలాన్ మస్క్.
Like this but X pic.twitter.com/PRLMMA2lYl
— Elon Musk (@elonmusk) July 23, 2023
X అనే అక్షరాన్ని పరిశీలిస్తోన్నామని మస్క్ చెప్పారు. ఇది యూజర్లకు నచ్చితే- రేపటి నుంచే ఈ లోగో అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇదివరకు ఎలాన్ మస్క్ తన వ్యాపార కార్యకలాపాలను ఎక్స్ కార్ప్‌గా మార్చిన విషయం తెలిసిందే. దీన్ని ప్రతిబింబించేలా ఎక్స్ అనే పేరును ట్విట్టర్ లోగోగా మార్చాలనే నిర్ణయానికొచ్చారు.












Click it and Unblock the Notifications