భారత ప్రజలకు ఇది పెద్ద అన్యాయం.. ఎలాన్ మస్క్ సీరియస్

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం మార్కెట్‌ అయిన భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్న ప్రపంచ కుబేరుడు, స్పేస్‌ఎక్స్ (SpaceX) వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ తీవ్ర అసహనానికి గురయ్యారు. భారత టెలికాం రంగంలో తమ ఆధిపత్యాన్ని, ఏకఛత్రాధిపత్యాన్ని కాపాడుకోవడానికి కొందరు సంపన్న వర్గాలు (Oligarchs) ఉద్దేశపూర్వకంగానే 'స్టార్‌లింక్' రాకను అడ్డుకుంటున్నాయని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వపరమైన అనుమతులు దాదాపు చివరిదశకు చేరుకున్న సమయంలో, కొన్ని శక్తులు అడ్డుగోడగా నిలుస్తున్నాయంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశీయ టెలికాం వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దేశ ప్రజలకు జరుగుతున్న పెద్ద అన్యాయం!

భారతదేశంలో టవర్లు, ఫైబర్ లైన్లు వేయడానికి వీలులేని సుదూర ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించేందుకు స్టార్‌లింక్ ఎంతగానో ఉపయోగపడుతుందంటూ వచ్చిన ఒక పోస్ట్‌కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. "దురదృష్టవశాత్తు భారత ప్రజలపై తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించడానికి కొందరు వ్యక్తులు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు. ఆ శక్తులు ఎవరో మీరు సులభంగానే ఊహించవచ్చు. ఇది భారత ప్రజలకు జరుగుతున్న పెద్ద అన్యాయం" అని మస్క్ చాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుత ధరలను భరించలేని వారికి, కనెక్షన్ లేని మారుమూల ప్రాంతాల వారికి స్టార్‌లింక్ ద్వారా అత్యంత తక్కువ ధరలోనే వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Elon Musk Attacks Indian Oligarchs Over Starlink Launch Delay Calls Blocked Internet Access a Crime

గణాంకాలతో వెలుగులోకి వచ్చిన డిజిటల్ వ్యత్యాసం

భారత్‌లో డిజిటల్ విప్లవం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, పట్టణ , గ్రామీణ ప్రాంతాల మధ్య ఇంటర్నెట్ సౌకర్యంలో ఇప్పటికీ భారీ వ్యత్యాసం ఉందనే విషయాన్ని సదరు పోస్ట్ ఎత్తిచూపింది. 2026 మే నాటి అధికారిక లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 11,256 గ్రామాల్లో నేటికీ కనీసం 4G కనెక్టివిటీ కూడా లేదు. ఇక 2026 మార్చి నాటికి దేశంలో మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య 109.3 కోట్లకు చేరినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 100 మందికి కేవలం 48 కనెక్షన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే పట్టణాల్లో ప్రతి 100 మందికి 126 కనెక్షన్లు ఉండటం విశేషం. ఈ అంతరాన్ని పూడ్చాలంటే భూమిపై ఉండే టవర్ల కంటే అంతరిక్షం నుంచి నేరుగా సిగ్నల్స్ ఇచ్చే శాటిలైట్ ఇంటర్నెట్ ఒక్కటే ఏకైక ప్రత్యామ్నాయమని మస్క్ బలంగా నమ్ముతున్నారు.

లోకంలోనే మొదటి 'ట్రిలియనీర్'. ప్రపంచాన్ని శాసించబోతున్న ఒకే ఒక్కడు!
లోకంలోనే మొదటి 'ట్రిలియనీర్'. ప్రపంచాన్ని శాసించబోతున్న ఒకే ఒక్కడు!

భారత్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న స్టార్‌లింక్

నిజానికి భారత్‌లో సేవలు అందించడానికి స్టార్‌లింక్ సంస్థ సాంకేతికంగా, మౌలిక వసతుల పరంగా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇండియాలో సేవలు అందించేందుకు అవసరమైన భద్రతా ప్రమాణాలు, నిబంధనలను పక్కాగా పాటించడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 20 గేట్‌వే సైట్లను, వందలాది యాంటెన్నాలను కంపెనీ నిర్మించింది. 'ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026' వేదికగా స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ మాట్లాడుతూ.. భారత వినియోగదారుల డేటా దేశ సరిహద్దులు దాటకుండా పూర్తి భద్రతా వ్యవస్థను తమ సిస్టమ్‌లో రూపొందించామని, ఐదేళ్లుగా భారతీయ నిబంధనలకు అనుగుణంగా తమ ఆపరేషన్లను తీర్చిదిద్దామని స్పష్టం చేశారు.

World Billionaires List: 18 ఏళ్లు నంబర్ వన్.. ఇప్పుడు బిల్ గేట్స్ ర్యాంక్ ఎంతో తెలుసా?
World Billionaires List: 18 ఏళ్లు నంబర్ వన్.. ఇప్పుడు బిల్ గేట్స్ ర్యాంక్ ఎంతో తెలుసా?

తుది అనుమతుల కోసమే ఉత్కంఠ ఎదురుచూపులు!

భారత ప్రభుత్వం ఇప్పటికే శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కోసం స్టార్‌లింక్‌తో సహా మరో రెండు సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినప్పటికీ, సర్వీస్ స్టార్ట్ చేయడానికి ప్రారంభించడానికి కావలసిన తుది స్పెక్ట్రమ్ కేటాయింపులు, నిబంధనల ఆమోదం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ మౌలిక వసతులు సిద్ధం చేసినప్పటికీ అనుమతులు ఆలస్యం కావడంపై స్పేస్‌ఎక్స్ యాజమాన్యం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలోనే మస్క్ నేరుగా భారత టెలికాం దిగ్గజాలనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించడంతో, రానున్న రోజుల్లో తుది అనుమతుల ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందోనన్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+