శభాష్ ఇస్రో.. కంగ్రాట్స్ చెప్పిన ఎలాన్ మాస్క్
స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మాస్క్ ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)ను అభినందించారు. గగన్ యాన్ కోసం వికాస్ ఇంజిన్‌పై మూడో దీర్ఘకాలిక పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇస్రో చేసిన ట్వీట్‌కు కంగ్రాట్స్ చెప్పారు మాస్క్. గగన్ యాన్ మిషన్ కోసం అవసరమైన పరీక్షలను ఇస్రో చేస్తోంది. కోర్ ఎల్110 లిక్విడ్ స్టేజ్ వద్ద హ్యుమన్ రేట్ జీఎస్‌ఎల్వీ వాహకనౌకను ప్రయోగించామని ఇస్రో ప్రకటన చేసింది.

తమిళనాడులో గల మహేంద్రగిరి నుంచి ప్రయోగించారు. 240 సెకండ్లలో లక్ష్యం దిశగా అడుగులు వేసింది. ఇంజిన్ పనితీరు లక్ష్యాన్ని చేరుకుందని.. పరిమితి అంచనాలకు పరీక్ష దగ్గరగా సరిపోతుందని పేర్కొన్నది. ఇప్పటికే నలుగురు భారతీయ వ్యోమగాములు రష్యాలో ఇప్పటికే జనరిక్ స్పైస్ ప్లైట్‌లో శిక్షణ పొందారు.












Click it and Unblock the Notifications