పుతిన్‌కు సవాల్ విసిరిన వేళ: ఎలాన్ మస్క్ పేరును మార్చుకున్నారుగా: చెచెన్ లీడర్‌తో వార్
వాషింగ్టన్: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కేంద్రం స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లోకెక్కారు. తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ అకౌంట్‌లో పేరును మార్చుకున్నారు. ఎలాన్ మస్క్‌గా ఉన్న పేరును ఎలానా మస్క్‌గా మార్చుకున్నారు. తన పొరుగు దేశం ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు సవాల్ విసరడం, దీనికి చెచెన్యా రిపబ్లిక్ అధినేత రంజాన్ కదిరోవ్ స్పందించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్న కొన్ని గంటల్లోనే ఎలాన్ మస్క్ తన పేరును మార్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రంజాన్ కదిరోవ్ తనపై టెలిగ్రామ్ పోస్ట్ ద్వారా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లను మస్క్ పోస్ట్ చేశారు. ఎలాన్ మస్క్.. తన పరిధులను అధిగమించుతున్నాడని, తనను తాను పుతిన్‌తో పోల్చుకోవడం సరికాదంటూ రంజాన్ కదిరోవ్ చెప్పారు. బాక్సింగ్ రింగ్‌లో మస్క్ రెడ్, వ్లాదిమిర్ పుతిన్ బ్లూ కార్నర్లల్లో ఉన్నారని కదిరోవ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన రాజకీయ నాయకుడు, వ్యూహకర్తతో ఓ వ్యాపారవేత్త తనను తాను పోల్చుకోవడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు.

ఎలాన్ మస్క్‌ను.. జెంటిల్ ఎలోనాగా అభివర్ణించారు కదిరోవ్. పుతిన్‌ను ఢీ కొనడానికి అవసరమైన శిక్షణను చెచెన్ రిపబ్లిక్‌లో ఇస్తామంటూ చురకలు అంటించారు. తమ వద్ద శిక్షణ పొందిన అనంతరం ఆయన పుతిన్‌తో తనను తాను పోల్చుకోవచ్చని ఎద్దేవా చేశారు. రష్యా ప్రత్యేక సైనిక బలగాల యూనివర్శిటీలో ఎలాన్ మస్క్.. ట్రైనింగ్ తీసుకున్నా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. పోరాటంలో మెళకువలను నేర్చుకోవడానికి అఖ్మట్ ఫైట్ క్లబ్‌లో చేరాలంటూ సలహా ఇచ్చారు.
Telegram post by Ramzan Kadyrov, head of Chechen Republic! pic.twitter.com/UyByR9kywq
— Elona Musk (@elonmusk) March 15, 2022
కదిరోవ్ చేసిన వ్యాఖ్యలకు ఎలాన్ మస్క్ బదులిచ్చారు. ట్రైనింగ్, మెళకువలను నేర్చుకోవాలంటూ తనను సూచించిన కదిరోవ్ థ్యాంక్స్ చెబుతున్నానని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం తాను పోరాటానికి సిద్ధమౌతానని ఎదురుదాడి చేశారు. ఈ పోరాటంలో తాను ఎడమ చేతిని మాత్రమే ఉపయోగిస్తాననీ చెప్పారు. అలాగనీ తాను ఎడమచేతిని వినియోగించడంలో నిష్ణాతుడిని కాదనీ ఎలాన్ మస్క్ కౌంటర్ అటాక్ చేశారు. రంజాన్ కదిరోవ్- వ్లాదిమిర్ పుతిన్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్‌పై కొనసాగిస్తోన్న యుద్ధాన్ని ఆయన సమర్థించారు కూడా.












Click it and Unblock the Notifications