మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్
పశ్చిమాసియాలో రోజురోజుకూ యుద్ధం తీవ్రతరమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దౌత్య వర్గాల్లో ఒక సంచలన వార్త చర్చనీయాంశమైంది. ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుటాహుటిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇది పెద్దగా ఆశ్చర్యపరిచేది కానప్పటికీ.. ఈ ఫోన్ కన్వర్షన్ లో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ జాయిన్ కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. దీనిపై న్యూయార్క్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
అనంతరం ఫోన్ సంభాషణల సారాంశం ఏమిటన్నది వైట్ హౌస్ అధికారికంగా వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలను ప్రెస్ సెక్రెటరీ కరొలినా లెవిట్ తెలియజేశారు. ఈ సంభాషణలో మధ్య ప్రాచ్య పరిస్థితి, వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, స్వేచ్ఛా వాణిజ్య కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలనే అంశాల గురించి ప్రధానంగా చర్చించారు. ఈ కాల్‌కు ఒక రోజు ముందు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌తో మాట్లాడారు.

ఈ అత్యున్నత స్థాయి చర్చల్లో మస్క్ పాల్గొనడం అసాధారణం. ఇది దౌత్య సంప్రదాయాలకు విరుద్ధమని భావిస్తున్నారు. యుద్ధం వంటి సున్నిత పరిస్థితుల్లో సాధారణంగా ప్రభుత్వ అధికారులనే అనుమతిస్తారు. మస్క్‌కు ఎలాంటి ప్రభుత్వ పదవులు లేనందున, రెండు దేశాల అగ్ర నాయకుల మధ్య జరిగిన సంభాషణలో ఆయన ఉనికి పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది. ఈ సంభాషణలో మస్క్ క్రియాశీలక పాత్ర పోషించారా లేదా, అసలు ఆయనను ఎందుకు చేర్చారనేది ఇంకా స్పష్టం కాలేదు.
ఇది అధ్యక్షుడు ట్రంప్‌తో ఆయన సంబంధాలు మెరుగుపడటానికి సంకేతం కావచ్చని అంచనాలు ఉన్నాయి. గతంలో ట్రంప్, మస్క్ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎలాన్ మస్క్ వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా అంతరిక్షం, ఇంధనం, అభివృద్ధి చెందుతున్న దేశాలు, మధ్యప్రాచ్యం, భారత్ వంటి యుద్ధ ప్రభావిత ప్రాంతాలతో సంబంధం కలిగి ఉన్నాయి.
భారత్ లో తన వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నారు. ప్రత్యేకించి శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి కోసం వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ చర్చల్లో ఆయన ఎంటర్ కావడం వ్యూహాత్మకమే. ఈ మొత్తం వ్యవహారంపై వైట్‌హౌస్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాన్ మస్క్ ఉనికిని అధికారికంగా ప్రస్తావించలేదు. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లెవిట్ దీనిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. అలాగే ఎలాన్ మస్క్ నుండి కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు.
మరోవైపు, ఇరాన్ ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గం హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్‌లను తీవ్రంగా దెబ్బతీసింది. షిప్పింగ్‌కు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలతో చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. ఆసియాలోని పలు దేశాలలో ఇంధన సరఫరా ఆందోళనలు కూడా తీవ్రమవుతున్నాయి.
-
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
దేశంలో పెట్రోల్, గ్యాస్ స్టాక్.. రెండు నెలలే -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం తీవ్రం- కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
భారత్‌కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం!












Click it and Unblock the Notifications