ఫ్యామిలీతో వచ్చి ప్రధాని మోడీని కలిసిన ఎలాన్ మస్క్
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk)తో బేటీ అయ్యారు. ప్రధాని మోడీ బస చేసిన బ్లెయిర్ హౌస్‌కు వచ్చిన ఎలాన్ మస్క్ ఆయనను కలిశారు. ఎలాన్ మస్క తన కుటుంబంతో వచ్చి ప్రధానిని కలవడం విశేషం.
భారతదేశంలో టెస్లా ఎంట్రీ, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలపై ఇరువురు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, ఎలాన్ మస్క్.. డొనాల్డ్ ట్రంప్ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీకి ఎలాన్ మస్క్ అధిపతిగా ఉండటం గమనార్హం.

అంతకుముందు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ తో ప్రధాని మోడీ సమావేశయ్యారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రధాని పంచుకున్నారు. మైక్ వాల్జ్‌తో ఫలవంతమైన సమావేశం జరిగిందన్నారు. ఆయన ఎప్పుడూ భారతదేశానికి గొప్ప స్నేహితుడన్నారు.
Watch: Elon Musk meets Indian PM Modi in Washington DC. Musk was joined by his kids as well at the meeting. pic.twitter.com/3VLQ3IRqsK
— Sidhant Sibal (@sidhant) February 13, 2025
రక్షణ, సాంకేతికత, భద్రత, భారతదేశం-అమెరికా సంబంధాలలో ముఖ్యమైన అంశాలు, సమస్యలపై తాము అద్భుతమైన చర్చను జరిపామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఏఐ, సెమీకండక్టర్లు అంతరిక్షం, మరిన్ని రంగాలలో సహకారానికి బలమైన అవకాశం ఉందని స్పష్టం చేశారు.
Had a fruitful meeting with NSA @michaelgwaltz. He has always been a great friend of India. Defence, technology and security are important aspects of India-USA ties and we had a wonderful discussion around these issues. There is strong potential for cooperation in sectors like… pic.twitter.com/5w3Gv2lMJ6
— Narendra Modi (@narendramodi) February 13, 2025
ఇక, భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని నరేంద్ర మోడీ కలవనున్నట్లు సమాచారం. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ ఆయనను తొలిసారి భేటీ కానున్నారు. సుంకాల విషయంలో ట్రంప్ కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో మోడీతో జరిగే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. వలసలపై ట్రంప్ కఠిన వైఖరిని అనుసరిస్తున్న క్రమంలో ఇరువురి నేతల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications