రెండో భార్య కూతురితో ఎలాన్ మస్క్ తండ్రి అక్రమసంబంధం: 76 ఏళ్ల వయస్సులో ఇద్దరు పిల్లలు పుట్టించాడు
వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్, ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోన్నాడు. 44 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాలను అర్ధాంతరంగా రద్దు చేసిన వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు ట్విట్టర్ యాజమాన్యం ఆయనపై కోర్టుకెక్కింది. పిటీషన్లను దాఖలు చేసింది.
సవతి కూతురితో..
ఈ పరిణామాల మధ్య ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రాల్ మస్క్ మరో బాంబు పేల్చారు. తన సవతి కుమార్తెతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఆమెతో మరో బిడ్డను కూడా కన్నట్లు స్పష్టం చేశారు. ఆ సవతి కుమార్తె పేరు జెనా బెజూడెన్హాట్. ఎర్రాల్ మస్క్ రెండో భార్య హీడో బెజూడెన్హాట్-ఆమె మొదటి భర్తకు పుట్టిన కూతురు. వయస్సు 34 సంవత్సరాలు. ఆమెతో ఎర్రాల్ మస్క్ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. 2017లో మగబిడ్డ, 2019లో ఆడబిడ్డకు జన్మించినట్లు చెప్పారు.
రెండో భార్య కుమార్తెతో
ఎర్రాల్ మస్క్ మొదటి భార్య పేరు మాయె హెల్డెమాన్ మస్క్. ఎలాన్ మస్క్ ఆమె కుమారుడే. ఎలాన్‌తో పాటు టోస్కా, కింబల్ మొదటి భార్య పిల్లలు. 1979లో ఆమెతో విడిపోయారు. అనంతరం హీడో బెజూడెన్హాట్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. హీడోకు కూడా అది రెండో వివాహమే. అప్పటికే ఆమెకు జెనా జన్మించింది. ఎర్రాల్ మస్క్-హీడో రెండో పెళ్లి నాటికి జెనాకు నాలుగేళ్ల వయస్సు. ఇప్పుడామెతోనే అక్రమసంబంధాన్ని పెట్టుకున్నారు.
అనుభవించడానికే..
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ది సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుట్టింది అనుభవించడానికేనంటూ తేల్చి చెప్పారు. పునరుత్పత్తి, పిల్లలను పుట్టించడానికే ఈ భూమిపై నివసిస్తున్నామని అన్నారు. జెనా బెజూడెన్హాట్‌తో రెండో బిడ్డను కన్నాననే విషయం ఇప్పటివరకూ ఎవరికీ తెలియదని చెప్పారు. 2019లో తనకు-జెనాకు ఆడబిడ్డ జన్మించిందని, ఎలాన్ మస్క్‌కు చెల్లెలు అవుతుందనీ అన్నారు.

ప్రత్యేక బంధం..
జెనా బెజూడెన్హాట్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, అది తామిద్దరి మధ్య శారీరక సంబంధానికి దారి తీసిందని ఎర్రాల్ మస్క్ చెప్పారు. దీన్ని తానేమీ తప్పుగా భావించట్లేదని వ్యాఖ్యానించారు. తాము ఈ భూమి మీదికి వచ్చిందే అనుభవించడానికేనని, పునరుత్పత్తి చేయడానికేనని అన్నారు. ఈ పరిణామాలు ఎలాన్ మస్క్‌ను మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications