TikTok News:ఎలాన్ మస్క్ చేతికి చైనా కంపెనీ..?

TikTok News:టిక్ టాక్... ప్రతి ఒక్కరికీ గుర్తు ఉండే ఉంటుంది. చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియోస్ యాప్ సామాన్యుడిని సైతం సెలబ్రిటీని చేసింది. ఒకప్పుడు భారత్‌లో టిక్‌టాక్ సృష్టించిన వీడియో సునామీ అంతా ఇంతా కాదు. అయితే గాల్వాన్ లోయలో చైనా పాల్పడిన దుశ్చర్య క్రీడతో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ను నిషేధించింది. దీంతో చైనా అతిపెద్ద మార్కెట్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇక టిక్‌టాక్ భారత్ నుంచి కనుమరుగవుతూనే ఇతర షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌కు మార్గం సుగుమం చేసి పోయింది. చాలా కాలం తర్వాత భారత్‌లో టిక్‌టాక్ మాట వినిపించింది. ఇందకు కారణం టెస్లా అధినేత ఎలాన్ మస్క్.

భారత్‌లో టిక్‌ టాక్ కథ ముగిసినపట్టికీ ఇతర దేశాల్లో మాత్రం ఆ షార్ట్ వీడియోస్ యాప్ యాక్టివ్‌గానే ఉంది. తాజాగా అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ పై నీలినీడలు అలుముకున్నాయి.టిక్‌టాక్‌ అమ్మకానికి వచ్చినట్లు పలు అంతర్జాతీయ పత్రికలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు
అంతర్జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది. అయితే టిక్‌టాక్ యాజమాన్యం మాత్రం ఈ వార్తలో నిజంలేదని ఇవన్నీ ఊహాజనితమైన వార్తలుగా కొట్టిపారేసింది.

Elon Musk to Buy TikTok US TikTok Dismisses Sale Rumors as Fiction

చైనాకు చెందిన టిక్ టాక్ ప్రతినిధులు అమెరికాలోని టిక్‌టాక్ ఆపరేషన్స్‌ను ఎలాన్‌మస్క్‌కు అమ్మేందుకు చర్చలు జరుపుతున్నట్లు ప్రముఖ పత్రిక బ్లూమ్‌బర్గ్ ఓ కథనం రాసుకొచ్చింది. ప్రస్తుతం చర్చలు ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు ఈ పత్రిక పేర్కొంది. టిక్‌ టాక్ యాప్‌ను అమెరికా నిషేధిస్తుందన్న వార్తలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పత్రిక వెల్లడించింది. ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ వార్త నిజమైతే కనుక అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్‌ను మస్క్‌కు చెందిన ఎక్స్ (ట్విటర్) చేపడుతుందని సమాచారం. అమెరికాలో ఎక్స్‌కు 170 మిలియన్ల మంది యూజర్లున్నారు. టిక్‌టాక్‌ను ఎక్స్‌తో ఇంటిగ్రేట్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే టిక్‌టాక్‌ కొనుగోలు ధర 40 బిలియన్ డాలర్ల నుంచి 50 బిలియన్ డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

దేశభద్రత కోసం

అమెరికాలో దేశ భద్రత ప్రధాన సమస్యగా మారిన నేపథ్యంలో టిక్ టాక్ క్రయవిక్రయాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్ డ్యాన్స్ కంపెనీ చైనాకు చెందినది కావడం అందునా చైనా ప్రభుత్వంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉండటంతో కొత్తగా వస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఈ యాప్‌పై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.ఇక అమెరికాలోని ప్రజా ప్రతినిధులు సైతం చైనాకు చెందిన ఈ యాప్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌తో వ్యక్తిగత సమాచారం, భద్రతపై గోప్యత ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో పెట్టుబడులను ఉపసంహరించుకునేలా బైట్ డ్యాన్స్‌పై ఒత్తిడి పెరుగుతంది. ఈ నేపథ్యంలోనే ఎలాన్‌ మస్క్‌కు టిక్ టాక్ అమెరికా ఆపరేషన్స్‌ను అమ్మేందుకు ప్రాథమిక చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

జనవరి 19 డెడ్ లైన్

అమెరికాలో తమ ఆపరేషన్స్‌ నిర్వహించేందుకు టిక్‌టాక్‌కు జనవరి 19న డెడ్‌లైన్ విధించడం జరిగింది.ఈలోగ బైట్ డ్యాన్స్ టిక్‌టాక్ యాప్‌ను ఎవరికైనా అమ్మేసి వచ్చినది తీసుకెళ్లాల్సి ఉంటుంది. లేదా దేశవ్యాప్తంగా టిక్‌టాక్ సేవలకు బ్రేక్ పడనున్నట్లు తెలుస్తోంది. ఈలోగ ఒక నిర్ణయం తీసుకోకపోతే ... ఆయా స్మార్ట్ ఫోన్లలో టిక్‌టాక్ ఉంటుంది కానీ యూజర్లకు ఎలాంటి అప్‌డేట్లు ఉండవు.అయితే ఎలాన్ మస్క్‌తో చర్చలు నడుపుతున్నట్లు వస్తున్న వార్తలను టిక్‌టాక్ కొట్టిపారేసింది. అయితే చైనాలో మస్క్‌‌ టెస్లా సంస్థను నడుపుతున్నారు. దీంతో మస్క్‌కు చైనాతో సత్సంబంధాలు ఉండటం, ఎక్స్ లాంటి బడా సంస్థలను ఆయన కొనుగోలు చేయడంతో బైట్ డ్యాన్స్ యాజమాన్యం కూడా మస్క్ వైపే చూస్తున్నట్లు సమాచారం.ఒక వేళ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ ఆసక్తి చూపకపోతే మైక్రోసాఫ్ట్, ఓరాకిల్, లాంటి టెక్ దిగ్గజ సంస్థలు ఈ షార్ట్ వీడియో యాప్‌ను కొనుగోలు చేసేందుకు సిధ్దంగా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

టిక్‌టాక్ పై నిషేధం విధిస్తే పరిస్థితి ఏంటి..

టిక్‌టాక్‌కు అమెరికాలో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. క్రియేటర్లు, యూజర్లు ఈ యాప్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదే సమయంలో టిక్‌టాక్‌కు కూడా మంచి బిజినెస్ జరుగుతోంది. ఒకవేళ నిషేధం విధిస్తే క్రియేటర్లు ఇతర ప్లాట్‌ఫామ్స్ అంటే యూట్యూబ్, ఇన్స్‌టాగ్రామ్ వైపు మళ్లే అవకాశం ఉంది. ఇదే జరిగితే మెటా, గూగుల్ సంస్థలు లాభపడతాయి.ఇక అమెరికా ప్రభుత్వం నుంచి టిక్‌టాక్ ఎదుర్కొంటున్న ఒత్తిడి ఒక వైపు దగ్గరపడుతున్న డెడ్‌లైన్ ఒక వైపు ఉండటంతో ఇప్పుడు అందరి దృష్టి మాతృసంస్థ బైట్ డ్యాన్స్,ఎలాన్ మస్క్ పై మళ్లింది. వీరిరువురూ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా.. ప్రపంచ వ్యాప్తంగా టిక్‌టాక్ భవిష్యత్తు ఎలా ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+