ఎలాన్ మస్క్ 'స్టార్ లింక్' ట్వీట్ పై రాహుల్ గాంధీ రిప్లై ఇదే..
స్పేస్ ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో షాకింగ్ పోస్టు పెట్టారు. భారత్ కు నిజమైన బాస్ అంబానీయేనా..? అని ప్రశ్నించారు. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలకు భారత ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వకపోవడంపై చర్చ నడుస్తున్న క్రమంలో ఆయన ట్వీట్ కీలకంగా మారింది. అంతకుముందు డాక్టర్. అనిరుద్ధ మల్పానీ, ఎండీ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.
" భారత ప్రభుత్వం తమ ప్రజల కంటే క్రోనీ క్యాపిటలిస్టులకే అధిక ప్రాధాన్యత ఇస్తోంది" అని పేర్కొన్నారు. ఆయన పోస్టుకు రిప్లై ఇచ్చిన ఎలాన్ మస్క్ ఈ విధంగా ఎక్స్ లో పోస్టు పెట్టారు. " ప్రపంచవ్యాప్తంగా దాదాపు 165 దేశాల్లో స్టార్ లింక్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు కొనసాగుతున్నాయి. అలాగే గత ఐదేళ్లుగా అన్ని నిబంధనలనూ పాటిస్తున్నాం. అయినా భారత్ లో దీనికి లైసెన్సు ఎందుకు లభించడం లేదు..? భారత్ కు నిజమైన బాస్ అంబానీయేనా..? అని ట్వీట్ చేశారు. అలాగే భారత్ లోని మారుమూల గ్రామాలకు ఇప్పటికీ మెరుగైన ఇంటర్నెట్ సదుపాయాలు అందుబాటులో లేవని ఈ నేపథ్యంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు కీలకంగా మారతాయని మస్క్ వెల్లడించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం కొరతపై వచ్చిన ఫిర్యాదులను తన ట్వీట్ లో పొందుపరిచారు.

అయితే ఎలాన్ మస్క్ ట్వీట్ పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కీలక రిప్లై ఇచ్చారు. " వెల్ కమ్ టూ ఇండియా ఎలాన్.. వెయిట్ టిల్ యూ డిస్కవర్ ది అథర్ గాయ్" అని మస్క్ ఎక్స్ పోస్ట్ కు రిప్లై ఇచ్చారు. మరోవైపు ఈ అంశంపై కేంద్ర టెలికామ్ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. టెలికాం, శాటిలైట్ సేవల కోసం భారత్ అనుసరిస్తున్న అనుమతుల విధానం పూర్తిగా న్యాయమైనదని.. ఎలాంటి వివక్ష లేనిదని పేర్కొంది. అనుమతులు కొందరికే దక్కుతున్నాయన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అలాంటి కథనాలు పూర్తిగా అపోహలేనని తేల్చింది.
Welcome to India, Elon. Wait till you discover the other guy.
— Rahul Gandhi (@RahulGandhi) October 8, 2026
కేంద్ర టెలికామ్ శాఖ ఇప్పటివరకూ మస్క్ కు చెందిన స్టార్ లింక్, రిలయెన్స్ జియో కు చెందిన శాటిలైట్ విభాగం జియో శాట్కమ్ అలాగే భారతీ కు చెందిన యూటెల్ శాట్ వన్ వెబ్ లకు లైసెన్స్ అనుమతులను మంజూరు చేసింది. అయితే అవేమీ ఇప్పటివరకూ తమ వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించలేదు. ఈ మేరకు లైసెన్స్ పొందిన ఈ మూడు సంస్థలకు సంబంధించి భద్రతా సమీక్ష జరుగుతోందని టెలికామ్ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications
