Plane: ఘోర ప్రమాదం జస్ట్ మిస్, వైరల్ వీడియో
హైవే మీద కార్లు దూసుకుపోతున్నాయి... ఒక్కసారిగా ఆకాశం నుంచి విమానం దూసుకొచ్చి రోడ్డుపై దిగింది! ఇది సినిమా సీన్ కాదు.. అమెరికా జార్జియాలో నిజంగా జరిగిన ఉలిక్కిపడే ఘటన.
సాంకేతిక లోపం తలెత్తిన సింగిల్ ఇంజిన్ శిక్షణ విమానం అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా, రద్దీగా ఉన్న హైవేపై దించాల్సి వచ్చింది. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న పలు వాహనాలను విమానం ఢీకొట్టడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా హైవేను తక్షణమే మూసివేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో హైవేపై కార్లు వరుసగా వెళ్తుండగా, ఒక్కసారిగా విమానం కిందికి దిగి వాహనాలను ఢీకొట్టిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూసినవాళ్లంతా షాక్‌కు గురవుతున్నారు.
CrashVision: Let’s just say, this is not your typical ride to work. A small airplane was forced to make an emergency landing on a busy roadway in Gainesville, GA!
— John Cremeans (@JohnCremeansX) February 10, 2026
It crashed into multiple vehicles.
Fortunately no one had severe injuries. pic.twitter.com/kDIG3pld2j
అధికారుల వివరాల ప్రకారం, లీ గిల్మర్ మెమోరియల్ విమానాశ్రయం నుంచి కాంటన్‌లోని చెరోకీ కౌంటీ విమానాశ్రయానికి బయల్దేరిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని పైలట్ గుర్తించాడు. విమానాశ్రయానికి తిరిగి వెళ్లేందుకు సరిపడా సమయం లేకపోవడంతో, పైలట్ క్షణాల్లో నిర్ణయం తీసుకుని హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడని తెలిపారు.
ఈ ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దర్యాప్తు ప్రారంభించింది. పైలట్ అప్రమత్తత వల్ల మరింత పెద్ద ప్రమాదం తప్పిందని కొందరు అభిప్రాయపడుతుండగా, రద్దీ రోడ్డుపై విమానం దిగడం పట్ల మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటే మాట - ఇది చూసినవారికి మాత్రం గుండె ఆగినంత పని!












Click it and Unblock the Notifications