ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఇక ‘హిందూ భోజనం’ దొరకదు
అబుదాబి: దుబాయ్ కేంద్రంగా నడిచే ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఆహార పదార్థాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు అనేక సర్వీసులను నడుపున్న ఈ ఎయిర్‌లైన్స్.. తమ విమానాల్లో ఇక 'హిందూ భోజనం' అందుబాటులో ఉండదని ప్రకటించింది.
తమ ఉత్పత్తులు, సర్వీసులపై క్రమానుగతంగా సమీక్ష చేస్తుంటామని తెలిపింది. ఇందులో భాగంగా తీసుకున్న తాజా నిర్ణయం తమ సేవలను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడుతుందని వెల్లడించింది.

విమానాల్లో అందించే ఆహారం, సేవలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే 'హిందూ భోజనం'ను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది.
అయితే, హిందూ ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా శాకాహార, మాంసాహార వంటకాల నుంచి ఎంచుకోవచ్చని తెలిపింది. శాకహార జైన్ మీల్, ఇండియన్ వెజిటేరియన్ మీల్, కోషర్ మీల్ అందుబాటులో ఉంటాయని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ వివరించింది.












Click it and Unblock the Notifications