వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్రాన్స్‌ అధ్యక్షుడుగా మెక్రాన్‌ -వరుసగా రెండోసారి : ఉక్రెయిన్‌పై రష్యా దాడి వేళ..!!

|
Google Oneindia TeluguNews

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ మరోసారి పీఠాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన అధ్యక్షుడిగా ఉండగా.. మరోసారి ఆయనకే ఆ పీఠం దక్కింది. అధికారిక ఫలితాలు వెలువడక ముందే ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌ ఓటమిని అంగీకరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేస్తున్న వేళ మెక్రాన్‌ రెండోసారి ఎన్నికవడం కీలకంగా మారింది. మెక్రాన్​ విజయంపై పలువురు ప్రముఖులు అభినందులు తెలిపారు. మెక్రాన్‌ రెండోసారి ఎన్నికవడం ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్‌లో నాయకత్వ స్థిరత్వానికి హామీ దక్కినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి.

Recommended Video

Emmanuel Macron : రికార్డులు తిరగరాస్తూ ఫ్రాన్స్‌ అధ్యక్షుడుగా వరుసగా రెండోసారి! | Telugu Oneindia

ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో మరీన్‌ లీపై గెలిచి 39 ఏళ్ల మెక్రాన్‌... ఫ్రాన్స్‌లో అతిపిన్న వయసు గల అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు. మాక్రాన్‌కు 58% ఓట్లు రాగా, పెన్‌కు 42% ఓట్లు పడ్డాయి. గడిచిన 20 ఏండ్ల కాలంలో వరుసగా రెండు సార్లు అధ్యక్షుడైన వ్యక్తిగా మాక్రాన్‌ చరిత్ర సృష్టించారు. మెక్రాన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు ఈఫిల్ టవర్ ముందు జాతీయ గీతాన్ని పాడుతూ ఫ్రాన్స్‌, యూరోపియన్ జెండాలను ఊపారు. మెక్రాన్‌తో కలిసి ఫ్రాన్స్, ఐరోపాలను మరింత అభివృద్ధి చేస్తామని ఈయూ చీఫ్‌ ఉర్సులా వాన్‌డర్ లేయెన్ ట్వీట్ చేశారు.

Emmanuel Macron comfortably defeated far-right rival Marine Le Pen in French elections

ఈయూ, నాటోలో విస్తృతమైన సహకారాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నట్లు డచ్ ప్రధాని ట్వీట్ చేశారు, రెండోసారి విజయం సాధించిన మెక్రాన్‌కు పలువురు అభినందనలు చెబుతున్నారు. అంతర్జాతీయ వేదికలపైగా స్థాయికి మించి పట్టు సాధించే నాయకుడిగా మేక్రాన్‌ను అభివర్ణిస్తున్నారు. మేక్రాన్ విధానాలు, అంతర్జాతీయ వ్యవహారాలలో ఆయన తీరును ప్రశంసిస్తున్న వీరంతా విడిగా మేక్రాన్‌ను ఇష్టపడకపోవచ్చు. ఆయన పూర్తిగా భిన్నమైన నేత అయినప్పటికీ ప్రజల నుంచి గౌరవం సంపాదించుకున్నారు.

English summary
Emmanuel Macron comfortably defeated far-right rival Marine Le Pen , heading off a political earthquake for Europe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X