వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేరం కాదట!: గృహహింసకు యువత మద్దతు!

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ప్రపంచంలో ఎక్కడైనా మహిళలపై ఎలాంటి హింస జరిగిన నేరంగానే పరిగణిస్తారు. మహిళల రక్షణ కోసం మనదేశంలోనైతే గృహహింసపై ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయి. అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రం మహిళలను కొట్టడం, హింసించడం నేరం కాదని పేర్కొంటుండటం గమనార్హం.

కాగా, 40ఏళ్ల క్రితమే మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఐక్యరాజ్యసమితి ఓ తీర్మానం చేసింది. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. అయితే, ఇప్పుడు అదే ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన తాజా నివేదికలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆగ్నేయ ఆసియాలోని తూర్పు టీమొఎల్‌ దేశంలో ఆడవాళ్లను గృహ హింసకు గురిచేయడం సబబేనని 81 శాతం టీనేజీ అమ్మాయిలే అంగీకరించారట. ఆ తర్వాతి స్థానాల్లో కిరిబాటి, సాల్మన్‌ ఐలాండ్స్, ఇథియోపియా, భూటాన్‌ లాంటి దేశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో గృహహింస తప్పుకాదని యాభై శాతానికి పైగా ప్రజలు భారత్, పాకిస్థాన్‌ దేశాల్లో కూడా అంగీకరిస్తున్నారు.

End Violence against Women

భార్యలపై 71శాతం గృహ హింస కొనసాగుతున్న ఇథియోపియా దేశంలో భర్తను, భార్యను కొట్టడం తప్పేమీ కాదని 64.8 శాతం మంది మహిళలు అభిప్రాయపడుతుండటం గమనార్హం. వంట చేసేటప్పుడు కూర మాడిస్తే కొట్టరా? అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు.

ఆసియా పసిఫిక్‌ దేశాల్లో భార్యను కొట్టడం కొన్ని సందర్భాల్లో సమంజసమేనని టీనేజీ అమ్మాయిలతోపాటు 51 శాతం నుంచి 25 శాతం టీనేజీ అబ్బాయిలు అంగీకరించడం నేటి ఆధునిక ప్రపంచంలో ఆశ్చర్యం కలిగించే అంశమే.

కాగా, పురుషాధిక్య సమాజం నుంచి సంక్రమించిన గృహ హింస కొన్నిదేశాల్లో ఇప్పటికీ కొనసాగడమే కాకుండా దానికి సమాజం ఆమోదం లభించడం విచారకరమని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వ్యాఖ్యానించింది.

అవిద్య, నిరుద్యోగం, వంశపారంపర్యంగా కుటుంబంలో కొనసాగుతున్న హింస తదితర కారణాల వల్లనే పలు ఆసియా పసిఫిక్‌ దేశాల్లో గృహ హింసకు ఆమోదం లభిస్తోందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.

కాగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే నిరుడి కంటే మహిళలపై గృహ హింస తగ్గిందని, ఆమోదం ఉన్న ఆసియా పసిఫిక్‌ దేశాల్లో కూడా తగ్గుముఖం పడుతోందని, భవిష్యత్తులో ఇది మరింత తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి ఆశాభావం వ్యక్తం చేసింది.

English summary
Violence against women and children is perhaps the most pervasive violation of human rights. At least one out of every three women around the world will be beaten, coerced into sex, or otherwise abused in her lifetime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X