సెల్ఫీ పిచ్చితో డాల్ఫిన్ ప్రాణం తీశారు(వీడియో)
బ్యూనస్‌ఎయిర్స్: సెల్ఫీలు ఇప్పటిదాకా మనుషుల ప్రాణాలనే తీశాయి. తాజాగా ఇతర జీవుల ప్రాణాలను కూడా తీసేస్తున్నాయి. అర్జెంటీనాలో జరిగిన ఈ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. మనషుల అనాలోచిత ప్రవర్తనతో ఓ చిన్ని డాల్ఫిన్ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అర్జెంటీనాలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. శాంటా టెరెసిటా నగరంలోని ఓ బీచ్‌లో ఓ వ్యక్తి అర్జెంటీనా, ఉరుగ్వే, బ్రెజిల్ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన రకానికి చెందిన పిల్ల డాల్ఫిన్‌ను సముద్రంలో పట్టుకున్నాడు.

దీంతో బీచ్‌లో ఉన్న వారంతా చుట్టూ చేరి ఒకరి తర్వాత ఒకరు ఫొటోలు తీసుకోవడం, దాన్ని పట్టుకోవడం చేశారు. ఒక్కరు కూడా దానిని నీటిలోకి వదిలే ప్రయత్నం చేయలేదు. చివరకు అది ప్రాణాలు కోల్పోయింది.
కాగా, ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా డాల్ఫిన్ మృతికి కారణమైన వారిపై మండిపడ్డారు.
ఇది ఇలా ఉండగా, స్థానిక అధికారులు, అర్జెంటీనా వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ కూడా డాల్ఫిన్స్‌కు హాని కలిగించవద్దని, ఒక వేళ దొరికితే సురక్షితంగా తిరిగి నీటిలోకి వదిలేయాలని సూచిస్తూ ఇటీవల ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ఐనా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం విచారకరం.












Click it and Unblock the Notifications