ఇక యూఎస్ అధికారిక భాష ఇదే- ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ: బిల్ క్లింటన్ ఉత్తర్వులు రద్దు
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు డొనాల్డ్ ట్రంప్. రోజుకో సరికొత్త ఉత్తర్వులను జారీ చేస్తోన్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేస్తోన్నారు. వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వస్తోన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో గొడవ తరువాత వివాదాలకూ కేంద్రబిందువు అయ్యారనే వాదనలూ లేకపోలేదు.
ఈ పరిస్థితుల మధ్య మరో కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెట్టారాయన. అమెరికా అధికారిక భాషకు సంబంధించిన ఆర్డర్ అది. ఇంగ్లీష్‌ను అధికారిక భాషగా గుర్తించడానికి ఉద్దేశించిన ఉత్తర్వులను జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. ఈ తరహా ఆర్డర్ జారీ కావడం అనేది- అమెరికా చరిత్రలోనే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇంగ్లీష్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర భాషల్లో డాక్యుమెంటేషన్, ఇతర సర్వీసులను అందించడాన్ని కొనసాగించాలా? వద్దా? అని వివాదానికి ఈ ఆర్డర్ తెర దించినట్టయింది. అధికారిక భాష కావడం వల్ల ఇంగ్లీష్ వైపే మొగ్గు చూపడానికి వెసలుబాటును కలిగించినట్టయింది.
అలాగే- ఆంగ్లేతర, పరిమితంగా ఇంగ్లీష్ భాషపై పట్టు ఉన్న వారికి ప్రభుత్వం/ ఫెడరల్ వ్యవస్థలు ప్రోత్సాహకంగా అందించే ఆర్థిక సహాయానికీ పుల్‌స్టాప్ పెట్టినట్టవుతుంది. గతంలో ఈ తరహా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జారీ చేశారు. ఇంగ్లీష్‌ను అధికారిక భాషగా గుర్తించడం వల్ల ఇది- ఆటోమేటిక్‌గా రద్దయ్యే అవకాశం ఉంది.
ఇంగ్లీష్‌ను అధికారిక భాషగా గుర్తించడం వల్ల కమ్యూనికేషన్‌ను క్రమబద్ధీకరించినట్టవుతుందని, డాక్యుమెంటేషన్ల రూపకల్పనలో గానీ, ఫెడరల్ వ్యవస్థలో ఎలాంటి గందరగోళానికి అవకాశం ఉండదంటూ ట్రంప్ తాజాగా జారీ చేసిన ఆర్డర్‌లో పొందుపరిచారు. జాతీయ విలువలు, సమైక్యతను బలోపేతం చేసినట్టవుతుందని, మరింత సమగ్రమైన, సమర్థవంతమైన సమాజాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు.
Executive Order Alert! 🇺🇸
— The White House (@WhiteHouse) March 2, 2025
ENGLISH IS NOW THE OFFICIAL LANGUAGE OF THE UNITED STATES.
America is SO BACK! pic.twitter.com/j7veShXHVt
ఈ ఆర్డర్- ఫెడరల్ ఏజెన్సీలు స్వేచ్ఛగా ఇంగ్లీష్‌లో తమ కార్యకలాపాలను కొనసాగించే వీలును కలగించినట్టయింది. ఒకే భాషను మాట్లాడటం వల్ల సమాజం సంఘటితమౌతుందని, ఒకే భాషలో స్వేచ్ఛగా పౌరులు ఆలోచనలను మార్పిడి చేసుకోగలరని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లో వెల్లడించారు. ఫలితంగా ఏకీకృత సమాజం మరింత బలోపేతమౌతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications