వేధిస్తున్నబ్రిటన్ వ్యక్తిని తరుముతూ కొట్టిన సిక్కు కుర్రాడు (వీడియో)
యునైటెడ్ కింగ్ డమ్: తన పైన నిత్యం జాతి వివక్ష చూపుతున్న ఓ బ్రిటన్ విద్యార్థి ఆగడాలను ఓ సిక్కు కుర్రాడు సహించలేకపోయాడు. నడి రోడ్డు పైన మరోసారి తనను వేధిస్తుండటంతో... ఇక ఆగలేక సదరు సిక్కు కుర్రాడు అతనికి ఎదురు తిరిగి చితకబాదాడు.

ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనికి ఇప్పుడు పెద్ద ఎత్తున క్లిక్స్ వస్తున్నాయి. ఈ ఘటన బ్రిటన్‌లోని ఓ పాఠశాల ముందు జరిగింది. బ్రిటన్ యువకుడిని కొట్టే ముందు సదరు సిక్కు కుర్రాడు తనను వేధించవద్దని కోరాడు.
అయినా అతను వినిపించుకోలేదు. దీంతో కోపాన్ని ఆపుకోలేని సదరు సిక్కు కుర్రాడు ఇక అతని పైన పిడిగుద్దులు కురిపించాడు. రోడ్డు పైన కింద పడేసి కొట్టాడు. అతనిని కొడుతూ, తరుముకుంటూ వెళ్లాడు. కాగా, ఆ సిక్కు కుర్రాడు.. తన కంటే ఎత్తుగా ఉన్న, బలంగా ఉన్న వ్యక్తిని కోపంతో కొట్టాడు.












Click it and Unblock the Notifications