ఆమె ఎవరో తెలియదు, ఏకాంతంగా.. లైంగిక ఆరోపణలపై బ్రిటన్ రాజు
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ స్పందించారు. వర్జీనియా గిఫ్రీపై ఏకాంతంగా గడపలేదని వివరించారు. వర్జీనియాను ఎప్‌స్టీన్ ప్రిన్స్‌కు పరిచయం చేశాడని వార్తలు వెలువడ్డాయి. అమెరికాకు చెందిన ఎప్‌స్టీన్ ఫైనాన్షియర్.. చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉండేవి. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తూ చనిపోయిన సంగతి తెలిసిందే.

ఇదీ విషయం..
అతని బాధితుల్లో వర్జీనియా గిఫ్రే ఒకరు. ఆమెను అనుభవించిన ఎప్‌స్టీన్.. ప్రిన్స్ యువరాజు ఆండ్రూతో సెక్స్‌లో పాల్గొనాలని బలవంత పెట్టాడనే వార్త అప్పట్లో కలకలం రేపింది. స్వయంగా గిఫ్రే కామెంట్స్ చేయడంతో దుమారం రేపింది.

ఇంటర్వ్యూలో..
బీబీసీ న్యూస్‌నైట్ ప్రోగ్రామ్‌కు ప్రిన్స్ ఆండ్రూ శనివారం ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో వర్జినీయా గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. ఆమెతో సంబంధం గురించి అడగగా.. వర్జినీయా ఎవరో తెలియదని సమాధానం ఇచ్చారు. తనకు తెలియనపప్పుడు సంబంధం ఎక్కడిదని చెప్పారు. అంతేకాదు తనను ఎప్పుడూ కలువలేదని చెప్పారు.

2001లో వేధింపులు
అయితే తనకు 17 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఎప్‌స్టీన్.. ప్రిన్స్ ఆండ్రూతో సెక్స్‌లో పాల్గొనాలని ఒత్తిడి చేశాడని వర్జీనియా ఆరోపించారు. 2001లో తనను వేధించాడని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ధనవంతులు, ప్రభావశీలుర వద్దకు అమ్మాయిలను పంపేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆండ్రూతో లండన్, న్యూయార్క్, వర్జీన్ ద్వీపంలో ఏకాంతంగా గడిపామని తెలిపారు. దీనిని కొట్ చేస్తూ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆండ్రూ తోసిపుచ్చారు. తనకు వర్జీనియా ఎవరో తెలియదని పాత పాటే పాడారు.

అది మాత్రం తప్పే..
మైనర్లను వ్యభిచార రొంపిలోకి దింపి, వారిపై లైంగికదాడికి పాల్పడిన ఎప్‌స్టీన్‌తో ఎందుకు స్నేహం కొనసాగించారని ప్రశ్నిస్తే స్పందించారు. జైలు నుంచి విడుదలైన సందర్భంలో ఒకసారి కలిశానని పేర్కొన్నారు. ఓ దోషిని కలిసి రాచ కుటుంబస్థాయిని తగ్గించానని అంగీకరించాడు. ఎప్‌స్టీన్ స్నేహం కొనసాగించడంపై విచారం వ్యక్తం చేశారు. ఇందుకు తనకు తాను ప్రతీ రోజు శిక్ష వేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఉన్నత ప్రమాణాలు, పద్ధతులు పాటించే రాజకుటుంబ స్థాయిని దిగజార్చానని మాత్రం అంగీకరించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications