అమెరికాలో హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎన్నికల బరిలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ నగ్న విగ్రహం ఒకటి మాన్‌హట్టన్‌లో సంచలనం రేపింది.
వాల్‌స్ట్రీట్‌కు సమీపంలో గల మాన్‌హట్టన్ సబ్‌వే స్టేషన్ వద్ద అసభ్యకరంగా ఉన్న ఈ విగ్రహాన్ని రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. బ్లోయింగ్ గ్రీన్ సబ్‌వేపై మంగళవారం ఉదయం ఇది దర్శనమిచ్చింది. హిల్లరీ టాప్‌లెస్ విగ్రహాన్ని చూసిన ఓ మహిళ ఆగ్రహంతో దానిని కిందపడేసింది.

దీంతో ఆ విగ్రహాన్ని తయారుచేసినట్టు చెబుతున్న ఆంథోనీ సియోలి, మహిళ నాన్సీ మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో విగ్రహాన్ని తిరిగి నిలబెట్టేందుకు సియోలీ ప్రయత్నించగా మహిళ అడ్డుకుని విగ్రహంపై కూర్చుండిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అనుమతి లేదని, దానిని తీసుకెళ్లిపోవాలని సియోలికి సూచించారు. కాగా ఆగస్టులో హిల్లరీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ నగ్న విగ్రహాన్ని కూడా అమెరికా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
-
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.












Click it and Unblock the Notifications