వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ నిర్ణయం వెనుక కారణమదే!: అది చూసి కూతురి గుండె పగిలిపోయింది..

ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ దాడి పట్ల చలించపోయింది. తన తండ్రి దీనిపై సకాలంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపింది. గ్యాస్ దాడి ఘటన తన గుండె పగిలిపోయేలా చేసిందని ఇవాంకా అభిప్రాయపడింది.

|
Google Oneindia TeluguNews

లండన్: ఓవైపు రష్యా వర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నా.. వారి హెచ్చరికలను లక్ష్యపెట్టకుండా సిరియా సైన్యంపై అమెరికా వైమానిక సేనలు క్షిపణి దాడులు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ అన్న వాదన వినిపిస్తోంది.

ట్రంప్ కుమారుడు ఎరిక్ దీనిపై స్పందిస్తూ.. సిరియాలో జరిగిన రసాయనిక దాడిలో వందలాది మంది చిన్నారులు మృత్యువాత పడటం తన తండ్రిని కలచి వేసిందని అన్నారు. రసాయనిక దాడి నేపథ్యంలో.. చిన్నారులపై దాని దుష్ప్రభావం పడకుండా మందును స్ప్రేను చేస్తున్న దృశ్యాలు ఆయన్ను చలించపజేశాయని ఎరిక్ తెలిపారు. ఘటన పట్ల ట్రంప్ కూతురు ఇవాంకా పడ్డ వేదన కూడా సిరియా వైమానిక స్థావరంపై అమెరికా దాడులకు కారణమని ఆయన వెల్లడించారు.

Eric Trump says Syria strike was swayed by ‘heartbroken’ Ivanka

ఇక ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ దాడి పట్ల చలించపోయింది. తన తండ్రి దీనిపై సకాలంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపింది. గ్యాస్ దాడి ఘటన తన గుండె పగిలిపోయేలా చేసిందని ఇవాంకా అభిప్రాయపడింది. దాడి భయంకరంగా, ఇది అత్యంత హేయమని టెలిగ్రాఫ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

సిరియాలో జరుగుతున్న అంతర్యుద్దం కారణంగా ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు. తాజా రసాయనిక దాడి సిరియా అధ్యక్షుడు అసద్ పనే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. సిరియా రెబెల్స్ ఆధీనంలో ఉన్న ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోని ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.

English summary
Ivanka Trump may have influence Trump to take action against the Syrian government Ivanka Trump may have influence Trump to take action against the Syrian government
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X