ఎరిక్‌సన్‌లో 25 వేల ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్దం?

ప్రత్యర్థుల నుండి పోటీ ని తట్టుకోవడం కోసం నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరగడంతో ఎరిక్‌సన్ అనే మొబైల్ కంపెనీ 25 వేల మందిని తొలగించాలనే నిర్ణయం తీసుకొంది.

స్టాక్‌హోమ్: ప్రత్యర్థుల నుండి పోటీ ని తట్టుకోవడం కోసం నిర్వహణ వ్యయాలు విపరీతంగా పెరగడంతో ఎరిక్‌సన్ అనే మొబైల్ కంపెనీ 25 వేల మందిని తొలగించాలనే నిర్ణయం తీసుకొంది.

ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితమైన ఉద్యోగుల తొలగింపు ప్రస్తుతం మొబైల్ కంపెనీలకు చేరుకొంది. టెలికం గేర్ మేకర్ ఎరిక్‌సన్ కంపెనీ 25 వేలమంది ఉద్యోగులను తొలగించేందుకు కసరత్తుచేస్తోంది.

సర్వీస్ డెలివరీ రంగాల్లో ఈ కోత ఉండే అవకాశం ఉందని ఓ పత్రిక ప్రకటించింది. మీడియా ఆపరేషన్ విభాగాన్ని తొలగించే అవకాశం లేకపోవచ్చని ఆ పత్రిక ప్రకటించింది.

Ericsson could shed 25,000 jobs in cost-cutting drive

నిర్వహణ వ్యయాలను తగ్గించుకొనే చర్యలను ఎరిక్‌సన్ వేగవంతం చేస్తున్నట్టు ఈ ఏడాది జూలైలోనే ఎరిక్‌సన్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ఉద్యోగాల ఏరివేతకు శ్రీకారం చుట్టింది.

చైనాకు చెందిన హువాయి,ఫిన్లాండ్‌కు చెందిన నోకియా నుండి పెద్ద ఎత్తున పోటీ పెరగడంతో మార్కెట్లు ఆశాజనకంగా లేకపోవడం, 5జీ టెక్నాలజీపై ఖర్చు పెట్టేందుకు టెలికం కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం కూడ కారణమని సమాచారం.

ఉద్యోగుల కొత స్వీడన్ బయటే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏ దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తారనే విషయమై స్పష్టత లేదు. కాగా, ఎరిక్‌సన్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.09 లక్షల మంది ఉద్యోగులున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+