రష్యాకు లొంగేది లేదు : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రసంగానికి ఈయూ దేశాల స్టాండింగ్ ఒవేషన్

ఉక్రెయిన్ చుట్టూ రష్యా తన బలగాలన్ని మోహరించింది. బాంబులతో తెగబడుతోంది. అయినా ఉక్రెయిన్ మాత్రం లొంగడం లేదు. రష్యా సేనలతో తమ పౌరులు ధైర్యంగా పోరాడుతున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ పేర్కొన్నారు. ఈ పోరాటంలో అంతిమ విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు. రష్యాకు తాము లొంగేపోయేది లేదని వార్నింగ్ ఇచ్చారు.

జెలెన్ స్కీ ప్రసంగానికి స్టాండింగ్ ఒవేషన్

యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు రష్యాను కోరుతున్నాయి. అయినా రష్యా మాత్రం తన
దూకుడును తగ్గించడం లేదు. ఉక్రెయిన్ కూడా సమర్థవంతంగా ప్రతిఘటిస్తుంది. యూరోపియన్ యూనియన్ దేశాల సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వర్చువల్ గా ప్రసంగించారు. ఈ సందర్భంగా జెలెన్ స్కీ ప్రసంగానికి ఈయూ దేశాల ప్రతినిధులు అభినందించారు. నిమిషం పాటు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆయనకు మద్దతు ప్రకటించారు.

 ఈయూ అండ‌తో పోరాటం

ఈయూ అండ‌తో పోరాటం


యూరోపియన్ యూనియన్‌లో భాగస్వామ్యం కోసం ఇప్పటికే ఉక్రెయిన్ దరఖాస్తు చేసుకుంది. తమ చేరికతో ఈయూ మరింత బలోపేతం అవుతుందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. మీ అంద‌రి అండ లేకుంటే ఉక్రెయిన్ ఒంటరిగా మిగిలిపోతుందని భావోద్వేగ ప్రసంగం చేశారు. రష్యాకు తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. అస‌లు ర‌ష్యా ల‌క్ష్యం ఏమిట‌నీ ప్ర‌శ్నించారు.

 మ‌మ‌ల్నిఎవరూ విచ్ఛిన్నం చేయ‌లేరు

మ‌మ‌ల్నిఎవరూ విచ్ఛిన్నం చేయ‌లేరు

రష్యా బాంబులతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో చిన్నారులు కూడా అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రధాన నగరాలను రష్యా బ్లాక్ చేసింది. తాము మా భూమి కోసం, స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామన్నారు. తమను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని తాము ఉక్రెయిన్లమని జెలన్ స్కీ నినదించారు. ఆయన ప్రసంగానికి ఈయూ ప్రతినిధులు చప్పట్టు కొడుతూ స్టాండింగ్ ఒవేసన్ ఇచ్చారు. తామంతా ఉక్రెయిన్ కు అండగా ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+