అరగంటలో.. ఏం కొన్నా ఫ్రీ, ఓ షాపింగ్ మాల్ ఆఫర్ , ఎగబడిన జనం.. ఎక్కడంటే.. (వీడియో)

ఏ వస్తువు తీసుకున్నా బిల్లు వేయరు. నగదు తీసుకోరు. అంటే ఉచితంగానే ఎవరికి నచ్చిన వస్తువును వారు తీసుకెళ్లిపోవచ్చు. ఇదీ ఆఫర్.. కానీ జస్ట్ అరగంట మాత్రమే. ఏం తీసుకున్నా ఆ అరగంటలోనే తీసుకోవాలి. ఎలా ఉంది

అబుదాబీ: పండగలు.. ఇతర ప్రత్యేక సందర్భాల్లో దుకాణ సముదాయాలు, వాణిజ్య సంస్థలు, షాపింగ్‌మాల్స్‌ పెద్దఎత్తున ఆఫర్లు ప్రకటించడం మామూలే. డిస్కౌంట్లు, ఆఫర్లు, లక్కీ డ్రాలు, ఒకటి కొంటే ఒకటి ఉచితం లేదా ఇతర రాయితీలను ప్రకటించి వినియోగదారులను ఆకర్షించేందుకు యత్నిస్తుంటాయి.

ప్రముఖ సూపర్‌ మార్కెట్‌ గొలుసు సంస్థ లూలు కూడా రంజాన్ సందర్భంగా సౌదీ అరేబియాలోని తన స్టోర్‌లో అరగంట ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. అరగంట సేపు మాల్‌లో వినియోగదారులు తమకు నచ్చిన వస్తువులను తీసుకెళ్లవచ్చు. ఏ వస్తువు తీసుకున్నా బిల్లు వేయరు. నగదు తీసుకోరు. అంటే ఉచితంగానే ఎవరికి నచ్చిన వస్తువును వారు తీసుకెళ్లిపోవచ్చు. ఇదీ ఆఫర్.

lulu-hypermarket

ఇంకేముంది? ఆఫర్‌ గురించి తెలుసుకున్న వినియోగదారులు ఎగబడిపోయారు. వేలాది మంది లూలు స్టోర్‌ కు చేరుకున్నారు. అరగంట పాటు ఆఫర్‌ సమయం ప్రారంభం కాగానే లోపలకు వచ్చి తమకు కావాల్సిన వాటిని తీసుకొని వెళ్లారు. పురుషులు ఎలక్ట్రానిక్‌ వస్తువుల కోసం మహిళలు తమకు నచ్చిన వస్తువుల కోసం పరుగుదీశారు.

రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా స్వచ్ఛందంగా దానం మంచిదని ఇస్లామిక్‌ మతసూత్రాలు బోధిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఇలాంటి కార్యక్రమాన్ని షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు నిర్వహించినట్టు తెలుస్తోంది. మన దేశంలోనూ లూలు షాపింగ్‌ మాల్‌ కేరళలోని కొచ్చి నగరంలో ఉంది.

అయితే ఇంకేం? ఇక్కడ కూడా అలాంటి ఆఫర్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? ఏమో ఎవరు చెప్పవచ్చారు? ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు మరి! ఇంతకీ ఆ అరగంటలో జనం ఎలా ఎగబడిపోయారో చూడాలనుకుంటే కింద ఉన్న వీడియోని క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+