ఫ్రాన్స్‌లో పెను సంచలనం -మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి జైలు శిక్ష
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీకి అవినీతి కేసులో ఆ దేశ కోర్టు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. తన ప్రచార ఆర్థిక విషయాలపై కోర్టులో ఉన్న సమాచారాన్ని అందించేందుకు బదులుగా మొనాకోలో న్యాయమూర్తి గిల్బర్ట్ అజిబర్ట్‌కి పదోన్నతిని కల్పించారన్న ఆరోపణలను సర్కోజీ ఎదుర్కొంటున్నారు.
అవినీతికి సంబంధించిన ఈ కేసు ఆరోపణలను సమర్ధించిన ఫ్రెంచ్ కోర్టు సోమవారం ఆయనను దోషిగా తేల్చింది. సర్కోజీకి మూడేండ్లు జైలు శిక్ష విధించింది. ఇందులో రెండు ఏండ్లను సస్పెండ్ చేసింది. దీంతో ఆ దేశ నిబంధనల ప్రకారం నికోలస్ సర్కోజీ ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే దీనిపై అపీల్ చేసేందుకు ఆయనకు కోర్టు పది రోజులు గడువు ఇచ్చింది.

నికోలస్ సర్కోజీ 2007 నుంచి 2012 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఉన్నారు. 2007 ఎన్నికల ప్రచారంలో ఆయన భారీగా ఆర్థిక సహాయం పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. 2012లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాత ఈ విషయం బయటపడింది.
అదే ప్రచారానికి లిబియా నుంచి ఆర్థిక సహాయం పొందారన్న ఆరోపణలపై మరొక దర్యాప్తు సందర్భంగా సర్కోజీ, ఆయన న్యాయవాది థియరీ హెర్జోగ్ మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి.













Click it and Unblock the Notifications