లంక మాజీ అధ్యక్షుడి సోదరుడు బాసిల్ రాజపక్స అరెస్ట్
కొలంబో: శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో మహింద సోదరుడు బాసిల్ రాజపక్సను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, గతంలో బాసిల్ రాజపక్స ఆర్థిక వ్యవహారాల మంత్రిగా కూడా పని చేశారు. శ్రీలంకలోని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్స్(ఎఫ్‌సిఐడి) అధికారులు మతారా పట్టణంలో అరెస్ట్ చేశారు.

శుక్రవారం అతడ్ని కోర్టు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాగా, గత సంవత్సరం కూడా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బాసిల్ రాజపక్స అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.












Click it and Unblock the Notifications