ముంబై సింగపూర్ విమానంకు బాంబు బెదిరింపు...ఎస్కార్ట్‌గా వెళ్లిన యుద్ధ విమానాలు

సింగపూర్ : ముంబై నుంచి సింగపూర్ వెళుతున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 263 మంది ప్రయాణికులు ఉన్నారు. ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ కాగానే విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు వచ్చింది. వెంటనే స్పందించిన సింగపూర్ విమానాశ్రయం అధికారులు విమానంకు రక్షణగా రెండు ఎఫ్‌ -16 యుద్ధ విమానాలను పంపారు.

F-16s escort Mumbai-Singapore flight after bomb threat

ఇక విమానం సింగపూర్‌లోని చాంగీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యేవరకు ఈ యుద్ధ విమానాలు రక్షణగా దాని వెనకే ఫాలో అయ్యాయి. విమానంలో 263 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి దర్యాప్తుకు ఆదేశించినట్లు సింగపూర్ విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. ఇక విమానంలో ప్రతి ఒక్క ప్రయాణికుడిని క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేసిన తర్వాత అందరినీ వదిలేశామని ఎయిర్‌లైన్స్ తెలిపింది. మరోవైపు ఓ మహిళ, మరో చిన్నారిపై అనుమానం రావడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ప్రాథమిక విచారణ ప్రకారం ముంబై విమానాశ్రయం నుంచి సోమవారం రాత్రి 11:30 గంటలకు బయలుదేరిన తర్వాత విమానం గాల్లో ఉన్న సమయంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.విమానంలో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడని అధికారులు తెలిపారు. రావాల్సిన సమయంకంటే కాస్త ఆలస్యంగా విమానం సింగపూర్ విమానశ్రయంలో ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+