అమెరికా F-35 VS రష్యా Su-57.. భారత్ కు అమ్మేందుకు పోటీ.. పాకిస్థాన్, చైనాల ఖేల్ ఖతం
భారత్ కు అటు పాకిస్థాన్, ఇటు చైనా దేశాలతో ఏళ్లకు ఏళ్లుగా వివాదం జరుగుతూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో అత్యాధునిక యుద్ధ విమానాలు వాడటం వల్లే భారత్ విజయం సాధించినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పోరాటం అసామాన్యం. టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లను పాక్.. భారత్ పై ప్రయోగించింది. అలా పాక్ నుంచి వచ్చిన దాదాపు 600 డ్రోన్ లను భారత్ ధ్వంసం చేసింది.
అంతేకాక ఆపరేషన్ సింధూర్ లో పాక్ ప్రయోగించిన చైనా క్షిపణులను కూడా భారత్ క్షిపణులు ధ్వంసం చేసింది. ఈ క్రమంలో అటు చైనా, ఇటు పాకిస్థాన్ మరోసారి కయ్యానికి కాలు దువ్వే పరిస్థితి లేకపోలేదు. దీంతో భారత్ ముందున్న లక్ష్యం అత్యాధునిక 5th జనరేషన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడమే. వీటిని భారత్ కు అమ్మేందుకు అమెరికా, రష్యా పోటీ పడుతున్నాయి. అమెరికా F-35 లేదా రష్యా Su-57 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఆపరేషన్ సింధూర్ తో వాయుసేన ప్రాముఖ్యత ఏంటో భారత్ కు అర్థమైంది. ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న రఫేల్ యుద్ద విమానాలు 4th, 4.5th జనరేషన్ కు చెందినవి. దీంతో ఈసారి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. అమెరికా F-35 లేదా రష్యా Su-57 యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేయనుంది.
ఎఫ్-35 vs ఎస్ యూ-57:
ఈ రెండు యుద్ధ విమానాలు ఓసారి పరిశీలిస్తే.. అమెరికాకు చెందిన F-35 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను లాక్ హీడ్ మార్టిన్ అనే సంస్థ రూపొందించింది. ఇది అత్యంత శక్తివంతమైన 5th జనరేషన్ యుద్ధ విమానం. ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలను అమెరికా నుంచి ఇజ్రాయెల్, జపాన్ తో పాటు నాటో కూటమి దేశాలు కొనుగోలు చేశాయి. ఇది సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానం. టాప్ స్పీడ్ 1.6 మాక్ వరకు ఉంటుంది. ఇది ఎయిర్ టూ ఎయిర్ , ఎయిర్ టూ గ్రౌండ్ పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. దీని పరిధి 1500 కిలోమీటర్లు. ఇక ఒక్కో ఎఫ్-35 ఎయిర్ క్రాఫ్ట్ ధర 80 మిలియన్ యూఎస్ డాలర్లు నుంచి 110 మిలియన్ యూఎస్ డాలర్ వరకు ఉంటుంది.

ఇక రష్యాకు చెందిన Su-57 యుద్ధ విమానాన్ని రష్యా ప్రభుత్వం అభివృద్ది చేసింది. ఇది కూడా 5th జనరేషన్ యుద్ధ విమానం. ఈ విమానాలను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్ కు ఇచ్చేందుకు రష్యా సిద్ధంగా ఉంది. ఇది రెండు ఇంజిన్ లు కలిగిన యుద్ధ విమానం. టాప్ స్పీడ్ మాక్ 2 వరకు ఉంటుంది. ఇది ఎయిర్ టూ ఎయిర్ , ఎయిర్ టూ గ్రౌండ్ పనిచేసే సామర్థ్యం కలిగి ఉంది. దీని పరిధి 1900 కిలోమీటర్లు. దీని ధర ఒక్కోటి 35 మిలియన్ డాలర్లు నుంచి 40 మిలియన్ డాలర్లు ఉంటుంది.












Click it and Unblock the Notifications