ఒక్క సీన్ వల్లే.. ఆ స్టార్ హీరోతో మళ్లీ నటించనంటున్న ప్రముఖ హీరోయిన్!

Aishwarya Lekshmi: మలయాళ ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మి ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్ తో భవిష్యత్తులో పనిచేయడంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 'కింగ్ ఆఫ్ కొత్త' సినిమాపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్ తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయని ఆమె వెల్లడించారు. ఈ ప్రతికూల స్పందన వల్ల మలయాళ సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్‌తో పాటు దుల్కర్ సల్మాన్‌తో మళ్లీ నటించే విషయంలోనూ ఆలోచనలో పడినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

యాంకర్ రంజినీ హరిదాస్ యూట్యూబ్‌కు ఛానెల్ కు వచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. " కింగ్ ఆఫ్ కొత్త చిత్రంపై విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా విడుదలయ్యాక వచ్చిన ట్రోల్స్ నన్ను చాలా ప్రభావితం చేశాయి. నా యాక్టింగ్, డైలాగ్ డెలివరీపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ ప్రభావంతో మలయాళ ఇండస్ట్రీ నన్ను కాస్ట్ చేయడానికి భయపడుతోందేమో అనిపించింది. కొన్ని సందర్భాల్లో ప్రేక్షకులు చెప్పింది నిజమేనేమో అని కూడా భావించాను" అని ఐశ్వర్య లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

Aishwarya Lekshmi On Dulquer Salmaan Says King Of Kotha Trolling Affected My Career damaged Confidence

షూటింగ్ స్పాట్‌లో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. "2024లో 'హలో మమ్మీ' సినిమా సెట్స్ లో ఓ అసిస్టెండ్ డైరెక్టర్ నేను కింగ్ ఆఫ్ కొత్త సినిమాలో దుల్కర్ ను 'రాజువేట్టా' అని పిలిచే విధానాన్ని ఎగతాళి చేశారు. ఆ సంఘటన నన్ను బాగా కలచివేసింది. ట్రోలింగ్ నన్ను ఏ స్థాయిలో దెబ్బతీసిందో ఆ రోజే అర్థమైంది" అని ఐశ్వర్య లక్ష్మి వివరించారు.

ట్రోలింగ్ ప్రభావం వల్ల దుల్కర్ సల్మాన్‌తో కలిసి చేయాల్సిన ఓ యాడ్ షూట్ ను కూడా ఐశ్వర్య లక్ష్మి వదులుకోవాల్సి వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. "దుల్కర్ సల్మాన్‌తో ఓ ప్రకటనలో నటించే అవకాశం వచ్చింది. కానీ గతంలో వచ్చిన విమర్శల వల్ల ఆ బ్రాండ్ కు ఎక్కడ సమస్య వస్తుందో అని భయపడి ఆ ప్రాజెక్ట్ వద్దని చెప్పాను. ఇకపై దుల్కర్ సల్మాన్‌తో కలిసి పనిచేయగలనో లేదో కూడా తెలియదు. అంతగా ఆ విమర్శలు నన్ను భయపెట్టాయి" అని ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చారు.

అభిలాష్ జోషి దర్శకత్వంలో రూ.50 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన 'కింగ్ ఆఫ్ కొత్త' బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.31.35 కోట్లు మాత్రమే రాబట్టి ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. సినిమా పరాజయంతో పాటు వచ్చిన ట్రోల్స్ తన వృత్తిపరమైన నిర్ణయాలపై ఎంతో ప్రభావం చూపాయని ఐశ్వర్య లక్ష్మి స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+